కార్తీక సోమవారం ప్రాధాన్యత

P Madhav Kumar


కార్తీకమాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది.. అందరూ కూడా సోమవార 'ఉపవాసం' చేస్తాం అంటారు.. 


❓అసలు ఈ సోమవార వ్రతం ఎన్ని రకాలుగా ఆచరించవచ్చు!!


 _*కార్తీక సోమవారాన్ని 6 విధాలుగా ఆచరించవచ్చు*_


1. _*ఉపవాసం*_

2. _*ఏకభుక్తము*_

3. _*నక్తము*_

4. _*అయాచితము*_

5. _*స్నానము*_

6. _*తిలదానము*_


 _*1. ఉపవాసము:*_


దీనిని ఆచరించేవారు పగలంతా ఏమీ తినకుండా సూర్యాస్తమయము తర్వాత శివుణ్ణి పూజించి♪, నక్షత్ర దర్శనం చేసుకుని కేవలం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు♪..


 _*2. ఏకభుక్తము:*_


రోజంతా ఉపవాసం చేయలేనివారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి.. రాత్రి పూట భోజనం బదులు తులసి తీర్థం సేవిస్తారు♪...


_*3. నక్తము:*_


పగలంతా ఉపవాసం ఉండి.. రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం (టిఫిన్) కానీ సేవిస్తారు..


_*4. అయాచితము:*_


రోజంతా ఉపవాసం ఉండి తమ భోజనం తాము వండుకోకుండా.. ఎవరైనా పిలిచి భోజనం పెడితే దానిని అయాచితము అని అంటారు..


 _*5. స్నానము:*_


పైన చెప్పిన నాలుగు విధాలు చేయలేనివారు స్నాన జపాదులు మాత్రమే చేస్తారు...


 _*6. తిలదానము:*_


మంత్ర జప విధులు తెలియని వాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసిన చాలు...


పై ఆరు విధాలలో ఏ విధానం ఆచరించినా కానీ, విశేషమైన ఫలితం వస్తుంది అని కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది♪...


👉 కాబట్టి, ఈ కార్తీక మాసాన్ని ఎవ్వరు కూడా వృధా చేసుకోవద్దు... ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇలాంటి అరుదైన మాసము...


👉 *_నక్తము*_ చేయడం అనేది చాలా చాలా మంచిది... కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయండి...


👉 మీ మీ శక్తిమేర సోమవారం రోజున పైన చెప్పిన 6 ఆచరణ విధానాలలో ఏదైనా ఆచరించి తరించండి. 


*సర్వే జనాః సుఖినోభవంతు* 


 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


 *హిందువునని గర్వించు*


 *హిందువుగా జీవించు*


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat