శిల్పశాస్త్రంలో విభిన్న భంగిమలలో, బిన్న రూపాలలో గణపతిని చూడగలం. గణపతి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కూర్చున్న బొజ్జ గణపతి మాత్రమే. నిలుచున్న గణపతి, నృత్య గణపతి, పాము పడగమీద నర్తిసుత్న గణపతి.... ఇలా పలు ఇతరరూపాలలో కూడా గణపతి దేవాలయాలలో సాక్షాత్కరిస్తాడు. గణపతి పార్వతీ తనయుడు. శైవ సంప్రదాయవాదులు ఆ తీరునే ఆయన్ని పూజించాలని అంటారు.
కాని వైష్ణవ ఆగమములో గణపతిని విష్ణుస్వరూపిగా వర్ణించడం జరిగింది. వైష్ణవ గణపతి రూపం అని విష్వక్సేనుడి సంహితలో వుంది.
గణపతిని స్త్రీరూపంలో కొలిచేవారు లేకపోలేదు. కొన్ని ప్రముఖ దేవాలయాలలో
గణపతి స్త్రీస్వరూపంలో పూజలందుకుంటున్నాడు. దక్షిణాదిన పవిత్రక్షేత్రమైన మధురైలోని సుందరేశ్వరాలయం వద్ద, కన్యాకుమారికి సమీపంలోని సచీంద్రంలోను, మధ్యప్రదేశ్లోని మండ్యర్లోను స్త్రీ గణపతిగా వెలసివున్నాడు.
