గణపతి పుట్టుక - Sri Ganesha Birth - Vinayaka Chaturthi Special
August 20, 2025
పరమశివుడు కైలాసమునకు వస్తున్నాడనె వార్తతో పార్వతి సంతోషించింది. ఆయనను ఆహ్వానించేందుకు ముస్తాబవడం కోసం అభ్యంగన స్నానమునకు సిద్ధపడింది. సమయమునకు ద్వారపాలకు లెవ్వరులేక, తాను వంటికి రాసుకోగా మిగిలిన నలుగు పిండితో బాలుని చేసి, ప్రాణం పోసి గణాధిపతిగా చేసి ద్వారం వద్ద కాపుంచెను. పార్వతి స్నానానంతరము సర్వాభరణమునకు సిద్ధమరుయ్యెను. ఈలోగా సదాశివుడు యధాప్రకారం లోనికి వెళ్లుతుండగా ద్వారపాలకుడైన బాలుడు అడ్డుకొన్నాడు. శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించగా ఆ శిరస్సు ఎక్కడికో ఎగిరిపోయింది. మొండెమొక్కటే పడిపోయింది. బైటకు వచ్చిన పార్వతి ఈ సంఘటన చూసి ఎంతగానో విలపించింది. సరళహృదయుడైన సదాశివుడు ఆమె కొరకు మొండెంగా వున్న గణపతి శరీరమునకు ముఖం ఎక్కడ కనపడకపోగా, తాను తీసుకువచ్చిన గజముఖాన్ని అతికించి, ప్రాణప్రతిష్ట చేసాడు. ఆ విధముగా గణపతి, గజముఖ గణపతి అయ్యాడు. పుత్రప్రేమతో పార్వతి పరమేశ్వరులు ఆనందంగా కాలము గడిపారు. గజాననుడు కూడ భక్తిభావంతో తల్లి దండ్రులను సేవించేవాడు. గజాననునికి సులభంగా ఎక్కితిరుగుటకు, అనింద్యుడను నొక మూషికమును వాహనంగా చేసుకొనెను.
Tags
