వినాయకచవితి పండుగ అంటే ముందురోజే వీధులన్నీ కోలాహలంగా వుంటాయి. రకరకాలయిన విఘ్నేశ్వరుడి | బొమ్మలతో, పత్రి, కలువ పువ్వులు, గొడుగులు, పాల వెల్లలు | అమ్మేవారితో, కొనుక్కునేవారితో నిండిపోతాయి. ఆ ఉత్సాహం, ఆ సరదా తనివి తీరనివి.
ఆ సందడంతా ఒక్క పండుగరోజుతోముగిసిపోదు. వీధివిధినా వెలసిన పందిళ్ళలో విఘ్నేశ్వరుడి పూజలు పదిరోజుల పాటు సాగుతాయి. చివరిరోజు ఊరేగింపుగా, | మేళతాళాలతో గణేశుడిని తీసుకెళ్ళి నిమజ్జనంచేస్తారు.
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్వోపశాంతయే
తెల్లనివస్త్రాలను ధరించినవాడు, చంద్రునిలా తెల్లనైనరంగు కలిగిన శరీరంవాడు, నాలుగు చేతులతో వుండేవాడు, అనుగ్రహ దృష్టితో చూచే ముఖం కలవాడు, అయిన విష్ణువును, అన్ని విఘ్నోలు శాంతిని పొందడం కోసం మనసుతో ధ్యానించవలసి వుంది కాబట్టి నేనూ అదే ఉద్దేశంతో ధ్యానిస్తున్నానని దీని అర్థం.
ఈ శ్లోకంలో వినాయకుడ్ని విష్ణువుతో కొలిచారు. “విష్ణుమ్” అన్నారందుకే.
“విష్ణుమ్” - అంటే అన్నింటినందూ వ్యాపించి వుండే లక్షణం కలవాడు అని అర్థం. ఇలా సకలసృష్టికి ఆధారమైనవాడూ, కాలగమనాన్ని తన అధీనంలో వుంచుకొనేవాడూ, అన్నింటిలోనూ వ్యాపించివుండేవాడు అయిన ప్రసన్న వదనమ్- ఏనుగు ముఖం కలిగినటువంటి వినాయకుడ్ని సకలవిఘ్నాలు తొలగేందుకు ప్రార్థిస్తున్నానని పై శ్లోకం భావం.
ఈ శోక్లాన్ని విష్ణువుకీ సమన్వయించవచ్చు. సకల సృష్టికీ ఆధారమైనవాడు, కాలాన్ని తన ఆధీనంలో వుంచుకొన్న వాడు (చంద్రుడూ, సూర్యుడూ అనే ఇద్దరూ తన రెండు కళ్లు కాబట్టి) నాలుగు చేతులున్నవాడూ అయిన విష్ణువును ధ్యానిస్తూ వున్నాననే అర్థం.
అప్పుడు "ప్రసన్న వదనమ్" అంటే "అనుగ్రహించే ముఖం కలవాడు” అనే అర్థాన్నే స్వీకరించాలి.
వినాయకుడెవరో కాదు సాక్షాత్తూ విష్ణువే. అందుకే లక్ష్మీగణపతి విగ్రహాలు మనకు కనబడుతుంటాయి.
విష్ణువు అంటే నారాయణుడు గదా.
నార ్శ అయనుడు - నీళ్లే స్థానంగా కలగినటువంటి వాడు అని దీనియొక్క భావం.
అందుకే వినాయక పూజ మొత్తం అయ్యాక వినాయకుడిని అంటే ఆ విష్ణువుని ఆయనకు తన సొంత ఇల్లైన నీటిలోనే నిమజ్జనం చేస్తున్నాం.
గణేశ ఉత్సవం స్వాతంత్య్ర సమరం నాటిది.
బ్రిటీషు పాలనకిందవున్న భారతావనిలో అన్నివర్గాల ప్రజలను సమైక్యపరిచి స్వాతంత్య్ర్యోద్యమాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో లోకమాన్య బాలగంగాధర తిలక్ ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టాడు.
అంటే గణేశ ఉత్సవం సమైక్యతకు శుభసూచకంగా సాగాలన్నమాట.
