కొండా కొండల నడుమా కొండల్ల నడుమా..
కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా {2} బెజవాడ క్షేత్రమునందు బంగారు తల్లీవై సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లీవే (2) కొలిచేటి భక్తులకెల్ల కోర్కెలనే తీర్చీ కొంగూ బంగారమైన అమ్మా దుర్గమ్మా (2) పసుపూ పచ్చని రూపూ పగడాలా తల్లీ శరణంటీమమ్మా నిన్నూ మా కల్పవల్లీ (2) ముక్కూకు ముక్కెరనేమో ధగధగ మెరువంగా పెయ్ నిండా బంగారంతో సింగారు మాతల్లీ.. కొండా కొండల నడుమా కొండల్ల నడుమా కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా మల్లే మందారపూల దండలనే అల్లీ మనసారా నీ మెడలోన వేసెదమూ తల్లీ (2) నీ ఇంద్రకీలాద్రి అందాల శిఖరంకూ కాలీనడకన మేమూ వచ్చీనామమ్మా (2) కష్టాలు కడతేర్చే కనకదుర్గమ్మవనీ కనుములు కట్నాలు నీకు తెచ్చీనామమ్మా.. కొండా కొండల నడుమా కొండల్ల నడుమా కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా నీ చల్లని చూపులతోనే అమ్మా దుర్గమ్మా మమ్ముల కాపాడమ్మా కనకదుర్గమ్మా (2) ఏటేటా నీ క్షేత్రముకు తప్పక వచ్చేమూ మ్రొక్కిన మ్రొక్కులన్నీ తీర్చేదమమ్మా (2) మా పిల్లా పాపలనూ చల్లంగ జూడమ్మా మా పాడిపంటలనూ పచ్చగ కాపాడూ కొండా కొండల నడుమా కొండల్ల నడుమా కృష్ణావేణి తీరాన వెలసిన అమ్మా దుర్గమ్మా బెజవాడ క్షేత్రమునందు బంగారు తల్లీవై సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లీవే(2) సిరులెన్నో కలిగించేటి సిరిగల్ల తల్లీవే (2)111. కొండా కొండల నడుమా కొండల్ల నడుమా.. | Konda kondala naduma | అమ్మవారి భజన పాటల
October 30, 2025
Tags
