{ ఏరు దాటించరో జాలరాన్నో, నన్ను నావ దాటించరో జాలరన్న } (2) ఏరు దాటించరో జాలరన్న , నావ దాటించరో జాలరన్న {నేను అలసి పోయి ఉన్నాను అప్పో అప్పో, నిన్ను నావ దాటించలేనప్పో అప్ప } (2) ఏరు దాటించలేనప్పో అప్ప { పొద్దు పోతుందిరో జాలరాన్నో, నన్ను ఏరు దాటించరో జాలరన్న } (2) నావ దాటించరో జాలరన్న {నేను అలసి పోయి ఉన్నాను అప్పో అప్పో, నిన్ను ఏరు దాటించలేనప్పో అప్ప } (2) నావ దాటించలేనప్పో అప్ప { చంటి బిడ్డ తల్లినిరో జాలరాన్నో, నన్ను ఏరు దాటించరో జాలరన్న } (2) నావ దాటించరో జాలరన్న {నేను అలసి పోయి ఉన్నాను అప్పో అప్పో, నిన్ను నావ దాటించలేనప్పో అప్ప } (2) ఏరు దాటించలేనప్పో అప్ప {వెంకటాపురం వెళ్ళాలి జాలరాన్నో, స్వామి గణపయ్య బజనలోకి జాలరన్న}(2) గణపయ్య పూజలోకి జాలరన్న { నేను చుక్క యేసి ఉన్నాను అప్పో అప్పో, నిన్ను నావ దాటించలేనప్పో అప్ప } (2) ఏరు దాటించలేనప్పో అప్ప { దండాలమ్మో దండాలమ్మో బెజవాడ దుర్గమ్మ దండాలమ్మ } (2) కంచి కామాక్షమ్మ "దండాలమ్మా" మధుర మీనాక్షమ్మ "దండాలమ్మా" కాశీ విశాలాక్షమ్మ "దండాలమ్మా" కలకత్తా కాళీవమ్మ "దండాలమ్మా" { దండాలమ్మో దండాలమ్మో బెజవాడ దుర్గమ్మ దండాలమ్మ } (2) అనకాపల్లి నూకాంబికా "దండాలమ్మా" పరవాడ పైడితల్లమ్మ "దండాలమ్మా" వెంకటాపురం ముత్యాలమ్మ "దండాలమ్మా" నునపర్తి నల్లమారమ్మ "దండాలమ్మా" { దండాలమ్మో దండాలమ్మో బెజవాడ దుర్గమ్మ దండాలమ్మ } (2) { అదిగో వచ్చెను దుర్గమ్మ ఇదిగో వచ్చెను దుర్గమ్మ } (2) [ బెజవాడ కొండ దిగి కదిలి వచ్చెను దుర్గమ్మ ] (1) [ అదిగో వచ్చెను దుర్గమ్మ ఇదిగో వచ్చెను దుర్గమ్మ ], [ అక్కడ చూడు దుర్గమ్మ ఇక్కడ చూడు దుర్గమ్మ ], [ అక్కడ ఇక్కడ ఎక్కడ చూడు ఎక్కడ చూసిన దుర్గమ్మ ], [ దుర్గమ్మ ఉూగింది గజ్జల సవ్వారి ], [ వేపాకు తోరణాలు తెచ్చాము తల్లి ], [ సాంబ్రాణి దూపాలు వేసాము తల్లి ] { మమ్మేలు మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే } (2) [ దుర్గమ్మ ఉూగింది గజ్జల సవ్వారి ], [ వేపాకు తోరణాలు తెచ్చాము తల్లి ], [ సాంబ్రాణి దూపాలు వేసాము తల్లి ] [ మమ్మేలు మాయమ్మ రావే బెజవాడ దుర్గమ్మ రావే ] { తకదిమితోం తకదిమితోం దుర్గమ్మ కనకదుర్గమ్మ మేము చమ్మచక్కలాడినము దుర్గమ్మ } (2) చమ్మచక్కలాడినము దుర్గమ్మ' చమ్మచక్కలాడినము దుర్గమ్మ.
112. ఏరు దాటించరో జాలరాన్నో | Eru daatincharo Jalaranna | అమ్మవారి భజన పాటల లిరిక్స్
October 30, 2025
Tags
