అడుగే ఆపను అయ్యప్ప నిన్ను చూసేదాక
ఇరుముడే దింపను నీ శబరికి కొండ చేరదాక (2)
అనుపల్లవి :-
కష్టాలు తరిమినగాని… ఈ… ఈ…
కన్నీళ్లు రాలినగాని… ఈ… ఈ…
గండాలు వచ్చినగాని… ఈ… ఈ…
గుండె బారమైతున్నగాని… ఈ… ఈ…
నీ శరణు విడవనయ్యా
నీ శబరి నడుతునయ్యా
నీ రూపు తలుతున్నయ్యా
నా చూపు మలుపనయ్యా (2)
చరణం – 1 :-
నేను మాల వేసినపుడు
అన్ని నాకు కలిసొచ్చే
ఇంటి గడప దాటినపుడు
బాధలెన్ని బరువెక్కే
నాకు ఆకలైనప్పుడు
కన్నతల్లి గుర్తొచ్చే
నాతో ఎవరులేనప్పుడు
తండ్రి నాకు యాదొచ్చే
నేను అలిసిపోయినగాని… ఈ… ఈ…
నరకయాతనెంతునగాని… ఈ… ఈ…
తనువు తల్లడిల్లినగాని… ఈ… ఈ…
దారిచూపు దీనతోని… ఈ… ఈ…
చరణం – 2 :-
ఎంత దూరమున్నగాని
నిన్ను చేరుకుంటాను
గుండె చాటు గోసలన్నీ
నీకు చెప్పుకుంటాను
నిందలన్ని మోపైన
నేను ఓర్చుకున్నాను
బాధలన్నీ బరువైన
భక్తి నింపుకున్నాను
కారు మబ్బు చీకటిలోన… ఆ… ఆ…
కాటువేసే కాలములోన… ఆ… ఆ…
కానరాని దూరములోన… ఆ… ఆ…
కాలినడక పయనములోన… ఆ… ఆ…
చరణం – 3 :-
నిదుర నాకు కరువైన
నిన్ను చూడ వస్తున్న
ఎదురు గండమేదైన
తట్టుకుంట ఏమైన
శబరి గుట్టలో ఉన్న
శరణు వేడుకుంటున్న
కరుణ కోరుకుంటున్న
కనిపించవననుకున్న
బంగారు బాలుడవయ్య… ఆ… ఆ…
అందాల చూపినవయ్య… ఆ… ఆ…
సిన్నంగా నవ్వుతున్నవయ్య… ఆ… ఆ…
చిన్నారి దేవుడవయ్య… ఆ… ఆ…
పాట విశేషాలు:
గానం: గంగాపుత్ర నర్సింగ్ రావు
గానం: గంగాపుత్ర నర్సింగ్ రావు
