91. ఆకాశమంతటి శ్రీశైల కొండను | Akashamantati Srishaila Kondanu | శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

91. ఆకాశమంతటి శ్రీశైల కొండను | Akashamantati Srishaila Kondanu | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
ఆకాశమంతటి శ్రీశైల కొండను
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా
ఆకాశమంతటి శ్రీశైల కొండను
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా

చీమలు దూరని చిత్తడవి కాకులు దూరని కారడవి
చీమలు దూరని చిత్తడవి కాకులు దూరని కారడవి
సింగలెలే  కోనంట చిరుతలు తిరిగే కొండంట
సింగలెలే  కోనంట చిరుతలు తిరిగే కొండంట
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా

శ్రీశైలవాసా శ్రీ మల్లికార్జున
మా వెంట నీవుంటే స్వామి ఈ కొండ ఎంతంటా
శ్రీశైలవాసా శ్రీ మల్లికార్జున
మా వెంట నీవుంటే స్వామి ఈ కొండ ఎంతన్నా
మల్లన్నో మల్లన్నో శ్రీశైలవాస మల్లన్నా
సాంబశివ సదాశివ శంభో శంకర మహాదేవా
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా

కైలాసవాసుడ భ్రమరాంబ నాథుడ
ఏ పూజ చేయాలా నిన్ను ఏ తీరు కొలవాలా 
కైలాసవాసుడ భ్రమరాంబ నాథుడ
ఏ పూజ చేయాలా నిన్ను ఏ తీరు కొలవాలా
శరణాలు శరణాలు శ్రీశైలవాస మల్లన్న
సాంబశివ సదాశివ శంభో శంకర మహాదేవా
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా

లింగా స్వరూపుడ శ్రీ నీలకంఠుడ
రుద్రాభిషేకాలు నీకు భస్మాభిషేకాలు
లింగా స్వరూపుడ శ్రీ నీలకంఠుడ
రుద్రాభిషేకాలు నీకు భస్మాభిషేకాలు
మల్లన్నో మల్లన్నో శ్రీశైలవాస మల్లన్నా
సాంబశివ సదాశివ శంభో శంకర మహాదేవా
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా

ఆకాశమంతటి శ్రీశైల కొండను
నేనెట్ట ఎక్కాలా స్వామి నిన్నెట్ట మొక్కాలా
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow