ఫ ల పూ జ
మంత్రము :- "శుద్ధి వృద్ధ్యభ్యుదయ సిద్ధి ద్వారా ఫలదేవతాంతర్వర్తి శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థం ఫలపూజామహాం కరిష్యే" సంకల్పమును జెప్పి ఫలపూజను జేయించాలి.
మంత్రము :-
ఫలం మనోరథ ఫలం, ప్రదదాతి సదా నృణాం ।
పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, అతః శాంతి ప్రయచ్ఛయే ॥
హిరణ్య గర్భ గర్భస్థః హేమబీజం విభావసోః ।
అనంత పుణ్యఫలదం, అతః శాంతి ప్రయచ్ఛయే ॥
ఈ మంత్రముచేత వధూవరులతో మహేశ్వరులకు టెంకాయను దక్షిణ సహితముగా దానమిప్పించవలెను. పిదప వరునిచేత రెండు టెంకాయలను (కొబ్బరికాయలను) వధువు యొక్క ఉడిలో బెట్టించవలెను.
