25. ప్రాయశ్చిత్తవిధి అథవా శుద్ధి సంస్కారము | Prāyaścittavidhi athavā śud'dhi sanskāramu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

25. ప్రాయశ్చిత్తవిధి అథవా శుద్ధి సంస్కారము | Prāyaścittavidhi athavā śud'dhi sanskāramu | Veerashaiva Purohitam

P Madhav Kumar
ఎవరైనా అపవిత్రులైన (బహిష్కృతులు) ను, (అకస్మాత్తుగా) తెలిసి తెలియకగాని, అన్యజాతియుల అన్న పానీయాదులను, మద్య-మాంసాదులను సేవించడం వల్లగాని, మానవ సమాజమునుండి వెలివేయ బడుటవల్లగాని, అట్టి వారిని గురువర్గము వారిచేగాని, అథవా సమాజము యొక్క ప్రముఖులనుండిగాని, దోషిగా నిర్ధారించి స్వజాతినుండి వెలివేయబడినచో అట్టి వారిని సమస్త జనుల అంగీకారముచేత లేదా బహుజన సమ్మతితో పరిశుద్ధులుగా (నిర్దోషులుగా) జేయదలచిన యెడల ఈ దిగువ దెల్పిన విధముగా ఆచరించవలెను.

ప్రాయశ్చిత్తమున కంగీకరించిన వారినుండి దేశకాలాదులను జెప్పించి “మమకాయక, వాచక, మానసిక, సాంసర్గిక దోష నిరసన పూర్వకం సర్వకర్మ సంశుద్ధి సిద్ధ్యర్థం శ్రీ గురుచరణోదకేన ప్రాయశ్చిత్త స్నాన మహం కరిష్యే”

అని సంకల్ప పూర్వకముగా గురు పాదోదకముచేత స్నానమొనర్పి ఉచియై, మడి వస్త్రమును ధరించి, విభూతి ధారణము గావించుకొని, లింగార్చన (శివపూజ) గురు పాదపూజలు జేసి, తీర్థ ప్రసాదములను భక్తి మీర సేవించి, గురువర్గము వారికి, సమాజ ప్రముఖులకు, తనకు గలిగిన దోషమునకు ప్రాయశ్చిత్త పూర్వకముగా క్షమాపణను గోరవలెను. గురువు సభికులందరుగల్సి యేకకంఠముతో క్షమింతురు. తరువాత పరిశుద్ధుడైన వ్యక్తి యధాశక్తి భక్త మాహేశ్వరారాధనను ఆచరించి మాహేశ్వరులకు మరియు సమాజోద్ధార కార్యములకుగాను తన శక్తికొలది ద్రవ్యమును దానమొసంగవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow