Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ప్రశ్న:- దీక్షామాల మార్గమధ్యంలో తీయవచ్చా? ఎక్కడ తీస్తే మంచిది? Can I take it in the middle of the initiation path? Where is the best place to take it?

P Madhav Kumar

#సమాధానం:

అయ్యప్ప దీక్షామాల విరమణకు సంబంధించి ప్రధానంగా రెండు పద్ధతులు వాడుకలో ఉన్నాయి.

మొదటి పద్ధతి. దీక్షామాల ఏ దేవాలయంలో (గురువుగారి సమక్షంలో) ధరించారో, శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వచ్చి అదే ఆలయంలో మాల తీయడం.

రెండవ పద్ధతి
. శబరిమల నుంచి ఇరుముడితో నేరుగా తమ స్వగృహానికి చేరుకుని, ఇంట్లోనే మాల విరమణ చేయడం.

భక్తులు గమనించవలసిన ముఖ్యమైన నియమాలు...


ఇతర క్షేత్రాలలో మాల తీయరాదు చాలామంది భక్తులు తిరుపతి, పళని, శ్రీశైలం వంటి ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అక్కడ మొక్కుబడులు ఉన్నాయని మార్గమధ్యంలోనే మాల తీసేసి తలనీలాలు (గుండు) సమర్పిస్తూ ఉంటారు.

శాస్త్రం ప్రకారం ఇలా అస్సలు చేయకూడదు.

గ్రామదేవతలకు మొక్కుబడులు ఉంటే. యాత్ర ముగించుకుని ఊరి పొలిమేరల్లోకి రాగానే, ముందుగా గ్రామదేవతను (పొలిమేర దేవతను) మనస్ఫూర్తిగా స్మరించుకుని, క్షమాపణ వేడుకుంటూ మొక్కుబడి చెల్లించుకోవాలి.

ఇంటికి చేరిన తర్వాత చేయవలసినవి:


స్వగృహానికి చేరుకోగానే మొదట ఇంటి ముందు నిలబడి, అపరాధ క్షమాపణగా ఒక కొబ్బరికాయ కొట్టాలి.

అనంతరం కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించి, పూజామందిరంలో దీపదర్శనం చేసుకోవాలి.

స్వామివారికి మరో కొబ్బరికాయ కొట్టి, కర్పూర హారతి ఇచ్చి, ఆ తర్వాతే ఇరుముడి విప్పి, కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందించాలి.

⚠️ అత్యంత ముఖ్యమైన గమనిక


ఒకవేళ గురుస్వామి సమక్షంలో పీఠం (ఆలయం) దగ్గర మాల తీసినప్పటికీ... భక్తులు దీక్షా వస్త్రాలతోనే (నలుపు/నీలం/కాషాయ బట్టలు) ఇంటికి వెళ్ళాలి. మాల తీసిన వెంటనే సాధారణ దుస్తులు మార్చుకోవడం. అయ్యప్ప భక్తులు ఈ సూక్ష్మమైన నియమాన్ని సహృదయంతో గమనించి, పాటించవలెను.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow