రఘురాముని సేవలో తరించిన నాధ
లక్ష్మణు ప్రాణము లేపిన నాధ
లంకిణి మదమును అణచిన నాధ
కొండగట్టులో వెలసిన నాధ
కోరిన కోరికల తీర్చే నాధ
హనుమంతుడా శ్రీ ఆంజనేయా
మా అంజన్నా స్వామి శ్రీ ఆంజనేయా
సీతాదేవిని చూచిన నాధ
ఆ సీత ముద్రిక నొసగిన నాధ
లంకా దహనము చేసిన నాధ
రావణాసురుని భంగపరిచిన నాధ
కొండగట్టులో వెలసిన నాధ
కోరిన కోరికల తీర్చే నాధ
హనుమంతుడా శ్రీ ఆంజనేయా
మా అంజన్నా స్వామి శ్రీ ఆంజనేయా
సముద్రము దాటి పోయిన నాధ
ఆ సంజీవి పర్వతము మోసిన నాధ
అహిరావణుని చంపిన నాధ
శ్రీరామ పట్టాభిషేకము చూచిన నాధ
కొండగట్టులో వెలసిన నాధ
కోరిన కోరికల తీర్చే నాధ
హనుమంతుడా శ్రీ ఆంజనేయా
మా అంజన్నా స్వామి శ్రీ ఆంజనేయా
సకల పాపాలు బాపేటి నాధ
మనోధైర్యమును ప్రసాదించే నాధ
భక్తుల గుండెల్లో కొలువైన నాధ
శరణన్న వారికి అండగా నిలిచే నాధ
కొండగట్టులో వెలసిన నాధ
కోరిన కోరికల తీర్చే నాధ
హనుమంతుడా శ్రీ ఆంజనేయా
మా అంజన్నా స్వామి శ్రీ ఆంజనేయా
