ఓ కోయిలా నిలబడవే కోయిలా ॥2॥
నువ్వచ్చే దారిలో ఏమి వనమే కోయిలా ॥2॥
నేనొచ్చే దారిలో బంతివనమే కోయిలా ॥2॥
బంతిపూలు తేద్దామా అంజన్న మేడలో వేద్దామా ॥2॥
అంజన్న మేడలో వేద్దామ స్వామి పూజలు చేద్దామ ॥2॥
ఓ కోయిలా ఓహో ఓహో కోయిలా ॥2॥
ఓ కోయిలా నిలబడవే కోయిలా ॥2॥
నువ్వచ్చే దారిలో ఏమి వనమే కోయిలా ॥2॥
నేనొచ్చే దారిలో జామ వనమే కోయిలా ॥2॥
జామ పండ్లు తేద్దామా అంజన్న చేతికిద్దామ ॥2॥
అంజన్న చేతికిద్దామా స్వామి పూజలు చేద్దామ ॥2॥
ఓ కోయిలా ఓహో ఓహో కోయిలా ॥2॥
ఓ కోయిలా నిలబడవే కోయిలా ॥2॥
నువ్వచ్చే దారిలో ఏమి వనమే కోయిలా ॥2॥
నేనొచ్చే దారిలో అరటి వనమే కోయిలా ॥2॥
అరటి పండ్లు తేద్దామా అంజన్న ఆరగిందామ ॥2॥
అంజన్న ఆరగిందామ స్వామి పూజలు చేద్దామ ॥2॥
ఓ కోయిలా ఓహో ఓహో కోయిలా ॥2॥
ఓ కోయిలా నిలబడవే కోయిలా ॥2॥
నువ్వచ్చే దారిలో ఏమి వనమే కోయిలా ॥2॥
నేనొచ్చే దారిలో జిల్లెడు వనమే కోయిలా ॥2॥
జిల్లెడు దండలు తేద్దామా అంజన్న మెడల వేద్దామ ॥2॥
అంజన్న మెడల వేద్దామ స్వామి పూజలు చేద్దామ ॥2॥
