146. నా చిన్ని మణికంఠ కు పందిరి వేయంగా / naa chinni manikantaku Pandiri - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

146. నా చిన్ని మణికంఠ కు పందిరి వేయంగా / naa chinni manikantaku Pandiri - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

నా చిన్ని మణికంఠకు పందిరి వేయంగా
పందిరి మీద ఆడింది నాకు పందిరి కొమ్మ మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు పంచే కట్టంగా
పంచమీదాడింది నాకు పంచ అంచు మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు ఊయల కట్టంగా
ఉయాల మీద ఆడింది నాకు ఊయల తాడుమీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు తిలకం దిద్దంగా
బొట్టు మీద ఆడింది నాకు కనుబొమ్మ మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
నా చిన్ని మణికంఠ కు పడినే కట్టంగా
పడి మీద ఆడింది నాకు పడి మెట్ల మీద ఆడింది నాకు
॥నా చిన్ని మణికంఠకు॥
శబరి తల్లి భూదేవికి ముక్కెర పెట్టంగా
ముక్కెర మీద ఆడింది నాకు ముక్కెర పుడక మీద ఆడింది నాకు...
॥నా చిన్ని మణికంఠకు॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow