Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

తల్లిదండ్రులను మరవ వద్దు

అందరిని మరిచినా నీ తల్లిదండ్రులను మరవ వద్దు,
వాళ్లను మించి నీ మంచిని కోరే వారెవరూ ఉండరని తెలుసుకో.

నువ్వు పుట్టాలని రాళ్లకు పూజలు చేశారు వారు,
రాయివై వారి హృదయాలను ముక్కలు చేయవద్దు.

కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు,
నీకు అమృతమిచ్చిన వారిపైనే నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు.

ముద్దు మరిపాలతో నీ కోరికలు తీర్చారు వారు,
ఆ ప్రేమ మూర్తుల కోరికలు నువ్వు తీర్చాలని మరవవద్దు.

నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానము అవుతాయా?
అంతా వ్యర్ధమే, సేవాభావం లేక గర్వం పనికి రాదు.

సంతానం వల్ల సుఖం కోరుతావు,నీ సంతాన ధర్మం మరవవద్దు,
ఎంత చేసేకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరవవద్దు.

నువ్వు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తిల్లో పడుకోబెటారు.
అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళకు అశ్రువులను నింపకు.

నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు,
ఆ మార్గదర్శకులకు నీవు ముల్లుపై వారిని బాధించకూడదు.

డబ్బు పోతే మళ్ళి సంపాద్చివచ్చు,
తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించుకోలేవు,
వారి పాదాల గొప్పతనం జీవితాంతం మరవ వద్దు.
📢 Follow