"శివరాత్రి''

P Madhav Kumar

🔱☘🔱☘🔱☘🔱☘🔱☘🔱

శివరాత్రి .."శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
 వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.

అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికంతటికీ పర్వదినం అయింది.

అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.

ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.అభిషేకం ఎందుకు చేయాలి ?"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.

ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.

అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం.

అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.

ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.

ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.

నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది.

"వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.

అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.

"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||

శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.

శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.

తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు,
"ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత.

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.

మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.

సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,

వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.

"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.

ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

 జాగరణ ఎందుకు చేయాలి..

క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.

"జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ,  గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.

మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.

ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.

ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.

బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.

అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి'' మహత్యం.

రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.

శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.

ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.

దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.

దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే..

ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.

అందుకే "మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..
🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌸 *శివరాత్రి - శివార్చన* 🌸


దీపారాధన చేసి, ఆచమనం సంకల్పం చేసుకొని కలశ గణపతి పూజ ముగించుకోవాలి.   
(శివునిపై ఉదకము చల్లుచూ, లేక విడుచుచు)

ఓం శూల పాణీయే నమః శివోః హం ప్రతిష్ఠితోభవ.

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో // శుద్ధస్పటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం /
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం //
నీలగ్రీవం శశాంకాంకం – నాగ యజ్ఞోపవీతినం /
వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్య మభయప్రదం //
కమండల్వక్ష సూత్రభ్యామాన్వితం శూలపాణినం /
జ్వలంతం పింగళజటా శిఖాముద్యోత ధారిణిం //
అతృతేనాప్లుతం హృష్టముమాదేహార్ధ ధారిణం /
దివ్యసింహాసనాసీనం – దివ్య భోగ సమన్వితం //
దిగ్దేవతా సమాయుక్తం – సురా సుర నమస్కృతం /
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం
సర్వవ్యాపిన మీశానమేవం వై విశ్వరూపిణం //
(పుష్పమును స్వామిపై నుంచవలయును. అనంతరము ఆవాహనమును చెప్పవలయును. నమకము నందలి 23 వ మంత్రము)

ఆవాహనం:

(మం) మానోమహన్తముతమానో అర్భకం మాన ఉక్షన్తముత మాన ఉక్షితమ్ /
మానోవధీః పితరం మోతం మాతరం ప్రియమాన్తనస్త నువోః // రుద్రదీరిష //
ఓం శివాయనమః ఆవాహయామి /
(పుష్పము నుంచవలయును. తరువాత నమకము నందలి యాతే రుద్రయను ప్రథము మంత్రముచే పుష్పాసనము సమర్పించవలయును.).

ఆసనం:

(మం) యాతేరుద్ర శివాతనూరఘోరా పాపకాశినీ //
తయానస్తనువాశంతమయా గిరీశన్తాభిచాకశీహి //
ఓం మహేశ్వరాయ నమః పుష్పం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

(మం) యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే
శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్
ఓం శంభవే నమః పాద్యం సమర్పయామి.
(ఉదకమును విడవవలెను.)

అర్ఘ్యం:

(మం) శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /
యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనాఅసత్ //
ఓం భర్గాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

ఆచమనం:

(మం) అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /
అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్య
ఓం శంకరాయ నమః ఆచమనీయం సమర్పయామి.
(ఉదకమును విడువవలెను.)

స్నానం :

(మం) అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః
యే చేమాగం రుద్రా అభితోదిక్షు //
శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే //
ఓం శాశ్వతాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం

ఆప్యాయస్వమేతుతే విశ్వతస్సోమవృష్టియం /
భవా వాజస్య సంగధేః //
ఓం పశుపతయే నమః క్షీరేణ స్నాపయామి .
(స్వామికి పాలతో స్నానము చేయవలెను)

ధదిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరస్వశ్యవాజినః /
సురభినో ముఖాకరత్ప్రమణ అయుగంషితారిషత్ //
ఓం ఉమాపతయే నమః దధ్యాస్నాపయామి .
(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)

శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవేవస్సవితోత్సునా
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్యరస్మిభిః //
ఓం పరబ్రహ్మణే నమః అజ్యేన్న స్నాపయామి.
(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)

మధువాకా యతాయుతే మధుక్షరంతి సింధవః
మాధ్వీన్నస్సంత్వౌషమాధీః / మధునక్తముతోషినీ //
మధువత్పార్ధిగం రజః మధుదౌరస్తునః స్థితాః /
మధుమాన్నో వనస్పతిర్మధురాగం (అస్తు) సూర్యః
మాధ్వీర్గావో భవంతునః //
ఓం బ్రహ్మాధిపాయనమః / మధునా పపయామి
(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)

స్వాధుః సవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ
సహనేతునామ్నే ! స్వాదుర్మిత్రాయ వరుణాయ
వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః /
ఓం పరమేశ్వరాయ నమః! శర్కరాన్ స్నపయామి.
(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)

యాః ఫలవీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రమాతోస్తానో ముస్త్వగ్ హంసః //
ఓం ఫాలలోచనాయ నమః – ఫలోదకేన స్నాపయామి
(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)

(తతః నమకచమకపురుషసూక్తేన శుద్ధోదకస్నానం కుర్యాత్)
అపోహిష్టామయోభువః – తాన ఊర్జేదధాతన /
మహేరణాయ చక్షసే యోవశ్శివ తమోరసః /
తస్మా అరంగ మామవః యస్యక్షయాయ జిన్వధ //
అపోజన యధాచనః
ఓం అష్టమూర్తయే నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి.
(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)

అభిషేకము:

(క్రింది మంత్రములను చదువుచు జలధార విడువవలయును)

ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముత తే నమః //
తయాన స్తనువాశం తమయా గిరిశన్తాభి చాకశీహి /
యామిషుం గిరిశన్త హస్తే భిభిర్ష్యస్తవే
శివాం గిరిత్రతాంకురు మహిగం సీః పురుషంజగత్ //
శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి /
యదానస్సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసత్ //
అధ్య వోచద ధివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్ /
అహంగ్ హీశ్చ సర్వానమ్భజస్సర్వాశ్చ యాతుధాయన్యః //
అసౌ యస్తామ్రౌ అరుణ ఉతబభ్రుసుమంగళః
యే చేమాగం రుద్రా అభితోదిక్షుః //
శ్రితాస్సహస్ర శోవై షాగం హేడ ఈమహే
అసౌయో పరస్పతిః నీలగ్రివో విలోహితః
ఉత్తైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉత్తైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః //
నమోఅస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే / అథోయే అస్య సత్వానో హం తేభ్యో కరం నమః
ప్రముంచ ధన్వన స్వముభయోరార్న్తి యోర్జ్యామ్
యశ్చతే హస్త ఇషవః పరాతా భగవోవ ప
అవతత్యదనుస్ట్వగం సహస్రాక్ష శతషుధే //
నిశీర శల్యానాం ముఖాశివో నస్సుమానాభవ //
విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత //
అనేశన్న స్యేషవ అభురస్య నిషంగధిః //
యాతే హేతిర్మీఢుష్టమ హస్తేబభూవతే ధనుః
తయా స్మానిశ్వత స్త్వమయక్ష్మ యా పరిభుజ //
నమస్తే అస్త్యాయుధాయాతా నాత య ధృష్ణవే
ఉభాభ్యాముత నమో బాహుభ్యా తవ ధన్వనేః
పరితే ధన్వనోహేతిరస్మాన్మృణక్తు విశ్వతః
అథోధియ ఇషు స్తవా రే అస్మిన్న దేహితమ్ //
మానో మహాన్త ముతమానో అర్భకం మాన ఉక్షన్త
ముతమాన ఉక్షీతమ్ / మానో వధీః పితరం మోతమాతరం
ప్రియామానస్తనువోః రుద్రరీరిషః //
మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో
అశ్వేషిరీరిషః వీరాజన్మానో రుద్రభామితో వఢఃఇర్హవిష్మన్తో నసుసావిధేమ తే //
అణోరణీయా మహమేవకత్వం మహానహం విశ్వ మదం వచైత్రం
పురాతనోహం పురుషోహమీశో హిరణ్యయోహం శిరూప మస్తి //
ఓం మృత్యుంజయాయ నమః అభిషేకం సమర్పయామి.

వస్త్రం:

(మం) అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్ను దహార్యః
ఉతైనం విశ్వభూతానిసః దృష్టో మృడయాతినః
ఓం మృడాయ నమః – వస్త్రయుగ్మం సమర్పయామి.

కటిబంధనము:

(మం) దీర్ఘాయుత్వాయజదృష్టిరస్మితం జీవామివరదః
పురూచరాయ సోషమభిసంవ్య యిష్యే /
ఓం భూతేశాయ నమః కటిబంధేనవస్త్రం సమర్పయామి.

భస్మదారణం:

(మం) అగ్నిరితభస్మ వాయురిత భస్మజమితి
భస్మస్థలమితి భస్మ వ్యోమేతిభస్మ సర్వగం హవాయ ఇదగం సర్వంభస్మ /
(మం) త్ర్యంబకం యజామహే ఉగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివబంధనాన్మృత్యోరుక్షీయమా మృతాత్ /
ఓం శర్వాయ నమః ఇతి భస్మధారణం.

యజ్ఞోపవీతం:

(మం) యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ /
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః //
ఓం సర్వేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

(మం) యోవైరుద్రవః యశ్చసోమో భూర్భువ
సువస్తస్మై నమోనమశ్శీర్ షంజనదోం విశ్వరూపోసి
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీశిణీం
ఈశ్వరీగం సర్వభూతానాంత్వామిహోపహ్వయేశ్రియం
ఓం సర్వజ్ఞాయ నమః గంధం విలేపయామి.
(గంధం చల్లవలెను.)

అక్షతలు

(మం) ఆయనే తే పరాయణే దూర్వారోహస్తు పుష్పిణః
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాణమే //
ఓం సదాశివాయ నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలు సమర్పించవలెను)

బిల్వపత్రం:

(మం) యావై రుద్రస్య భగవాన్యశ్చ సూర్యోభూర్భువ
సువస్తస్మైవై జనమోనమశ్శీర్ షంజనదో విశ్వరూపోసి //
శ్లో // అమృతోద్భవ శ్రీవృక్షం శంకరస్య సదాప్రియా /
తత్తేశంభో ప్రయచ్ఛామి బిల్వపత్రం సురేశ్వర //
త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలై శుభైః /
తవపూజాం కరిష్యామి అర్చయేత్పరమేశ్వరః //
గృహాణ బిల్వపత్రాణి సుపుష్పాణి మహేశ్వరః /
సుగంధేన భవానీశ హివత్త్వం కుసుమప్రియః //
ఓం అభయాయ నమః బిల్వపత్రాణి సమర్పయామి.
(బిల్వపత్రములు వేయవలెను)
(అనంతరం అష్టోత్తరశతనామైర్వాత్రిశతనామైర్వా సహస్ర నామైర్వాప్రపూజయేత్)

అథాంగపూజ:

ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి.
ఓం శివాయ నమః – జంఘే పూజయామి.
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి.
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి.
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి.
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి.
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి.
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి.
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి.
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి.
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి.
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి.
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి.
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి.
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి.
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి.
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి.
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి.
ఓం పరమేశ్వరాయ నమః – పూజయామి.

లింగపూజ:

ఓం నిధనపతయే నమః
ఓం నిధనపతాంతికయై నమః
ఓం ఊర్ధ్వాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం సువర్ణాయ నమః
ఓందివ్యాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శివాయ నమః
ఓం జ్వలాయ నమః
ఓం ఆత్మాయ నమః
ఓం పరమాయ నమః
ఓం ఊర్థ్వలింగాయ నమః
ఓం హిరణ్యలింగాయ నమః
ఓం సువర్ణలింగాయ నమః
ఓం దివ్యలింగాయ నమః
ఓం భవలింగాయ నమః
ఓం శర్వలింగాయ నమః
ఓం శివలింగాయ నమః
ఓం జ్వలలింగాయ నమః
ఓం ఆత్మలింగాయ నమః
ఓం పరమలింగాయ నమః

ధూపం:

నవవస్త్వా ధూపయంతు / గాయత్రే ఛందసాంగి -
రస్వద్ద్రుద్రాస్త్వా భూపయంతు / త్రెష్టుభేన ఛందసాంగి
రస్వదాదితాస్త్వా ధూపయంతు / జగతేన ఛందసాంగి
రస్వదిఁ బ్రస్త్వా ధూపయత్వం / గిరిస్వదివ్వష్ణుస్త్వా ధూపయర్వంగిరస్వ /
వ్వరుణత్వా ధూపయత్వం గిరిస్వదదలిప్తా దేవీర్విశ్వ దేవ్యాపతీ /
పృధీవ్యాసృభస్థేంగిదసర్దనత్యనట దేవానాం త్వాపత్నీ /
ఓం భీమాయ నమః – ధూపమాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను). దీపం:
ఆపాణి పాదోహ మంచిత్తపశ్శ్క్తిం, పశ్వామ్య చక్షుస్స
శృణోన్యుకర్ణః సవేత్తివేద్యం నదతపాప్తి, వేత్తాత మహురగ్ర్యం పురుషం మహంతం
సర్వవ్యాపిన మాత్మానం క్షీరే సర్పి శివార్పితంసా
ఆత్మవిద్యా తపోమూలం త్ద్బ్రహ్మోపవిషదమ్ //
నతత్ర సూర్యోభాతినః చంద్రతారకం
నేమావిద్యుతో భాంతికురో యమగ్ని తస్యభాసా సర్వమిదమ్ విభాతి //
ఓం మహాదేవాయ నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

నైవేద్యం:

(మం) దేవసవితః ప్రసువసత్యంత్వర్తేన పరిషంచామి
అమృతమస్తు అమృతోప స్తరణమసి స్వాహా //
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

(మం) ఉమారుద్రాయ తవసే కపర్థినేక్షయద్వీరాయ
ప్రభరామహమతిం / య్ధావశ్శమ అద్విపదే
చతుష్పదే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్న నాతురమ్ //
ఓం త్రిపురాంతకాయ నమః తాంబూలం సమర్పయామి.
తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

నీరాజనం:

శ్లో // పరానంద చిదాకాశ – పరబ్రహ్మ స్వరూపికా /
నీరాజనం గృహాణేశ – ఆనందాఖ్యం సదాశివ //
(మం) అర్యప్రజామే గోపాయ – సర్వప్రజామే గోపాయ – అమృతత్త్వాయ జీవసే జనిష్యమాణాంచ / అమృతేసత్యే ప్రతిష్టితామ్ అధర్వపితుంమే గోపాయ రసమన్న మిహాయుషే అదబ్దాయో శీతతనో అవిషన్న పితుంకృణుః స్వపశూన్మే గోపాయః ద్విపాదో యే చతుష్పదః అష్టాశ పాశ్చాయ ఇహగ్నే / యేచైక్ శపా అనుగాః సప్రధస్సభాంమే గోపాయ యేచక్యాస్సభాసదః తానింద్రియావతః కురుసర్వమయూరు పానతామ్ హేర్భుద్ని య మంత్రం మే గోపాయ యమృషయస్రై విదావిదుః // ఋచుస్సామాని యజూగంషిపాహి శ్రీరమృతానతామ్ / మానో వాగంసీ జాతవేదోగామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్న గహిశ్రియా మా పరిపాలయా సామ్రాజ్యం చ విరాజం చాభి శ్రీర్యాచనో గృహలక్ష్మీ రాష్ట్రస్యయ ముఖేతయా మానగం సృజామసినం తత శ్రీరస్తుః నిత్యమంగళాని భవంతు.
ఓం సదాశివాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి.
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
అనంతరం ఆచమనీయం సమర్పయామి.

మంత్రపుష్పమ్:

ఓం సహస్ర శీర్ షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం,
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదం.
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగం హరిం.
విశ్వమేవేదం పురుషస్త ద్విశ్వముఅపజీవతి,
పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం,
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః,
నారాయణ పరంబ్రహ్మ తత్త్వం నారాయణః పరః
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః
యచ్చకించిజ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతే పివా,
అంతర్బహిశ్చ త త్సర్యం వ్యాప్య నారాయణ స్స్థితః
అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం,
అధోనిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్ఠతి,
జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,
సన్తతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.
తస్యాన్తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః.
సోగ్రభు గ్విభజ న్తిష్ఠ న్నాహార మజరః కవిః
తిర్యగూర్థ్వ మధశ్శాయీ రశ్శయస్తస్య సంతతా,
సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తగః,
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః,
నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవారశూకవ త్తన్వీ పీతా భాస్వత్యణూపమా,
తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరిస్సేంద్ర స్సోక్షరః పరమః స్వరాట్.
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే,
నమో వయం వై శ్రవణాయ కుర్మహే
స మే కామా న్కామకామాయ మహ్యం
కామేశ్వరోవైశ్రవణో దదాతు.
కుబేరాయవైశ్రవణాయ, మహారాజాయ నమః
ఓం తద్బ్రహ్మ – ఓం తద్వాయుః ఓం తదాత్మా
ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః.
అన్తశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కాస్త్వ మింద్రస్తగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః / త్వం తదాప ఆపోజ్యోతి రసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ //
(ఈశాన్యస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మధిపతిర్బ్రహ్మణీధిపతిర్బ్రశివోమే అస్త్సదా శివోం
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్ //
( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ఆత్మప్రదక్షిణ. (కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః,
త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.
శ్రీ సదాశివాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
పునః పూజాం కరిష్యే ! 
ఛత్రం సమర్పయామి, చామరం సమర్పయామి , నృత్యం సమర్పయామి , గీతం సమర్పయామి, వాహనం సమర్పయామి సమస్త రాజోపచారం దేవోపచార పూయం సమర్పయామి . 
 
                 *శివ పరివార అర్ఘ్యములు*
1 ). శివ అర్ఘ్య ప్రదానం.  

శ్లో !! నమో విశ్వ స్వరూపాయ విశ్వ సృష్ట్యాధికారక !
గంగాధర నమస్తుభ్యం గృహాణార్ఘ్యం మయార్పితం !!
శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

శ్లో !! నమశ్శివాయ శాంతాయ సర్వపాప హరాయచ !
శివరాత్రౌ మయాదత్తం గృహాణార్ఘ్యం మయార్పితం !!
శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

శ్లో !! దుఃఖ దారిద్ర్య పాపైశ్చ దగ్ధోహం పార్వతీపతే !
మాం త్వం పాహి అహాబాహో గృహాణార్ఘ్యం మయార్పితం !!
శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

శ్లో !! శివ శివరూపాయ భక్తానాం శివదాయక !
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి ప్రసన్నో భవ సర్వదా !!
శంకరాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

2 ) ! పార్వతీ దేవి అర్ఘ్యం !           
అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతీ !
అంబికే వరదే దేవి గృహ్ణీదార్ఘ్యం ప్రసీద !!
అమ్బికాయై నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

3 ) ! గణపతి అర్ఘ్య ప్రదానం !
విఘ్న నాశాయ దేవేశ విఘ్నరాజ నమామ్యహం !
త్వత్ ప్రసాదేన కార్యాణి చ కరోమ్యహం !!
గణపతయే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

4 ) ! సుబ్రహ్మణ్య స్వామి అర్ఘ్యం !
సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురేశ్వర !
ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సుప్రీతో వరదా భవ !!
సుబ్రహ్మణ్యాయ నమః నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

5 ) శ్రీ చండికేశ్వరాయ నమః 
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

6 ) శ్రీ నందికేశ్వరాయ నమః 
ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 

శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం //
మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు
శ్రీ సదాశివ ప్రసాదం శిరసా గృహ్ణామి //
(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)

తీర్థస్వీకరణం:

శ్లో // అకాలమృత్యుహరణం – సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం – శివపాదోదకం పావనం శుభం //
(అనుచు స్వామి పాద తీర్థమును పుచ్చుకొనవలెను.)
*పూజా విధానము సంపూర్ణం*. 🙏


*ఓం నమః శివాయ*
*శ్రీరుద్రాష్టకమ్*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!*

*అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!*


*2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!*

*కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!*


*3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!*

*స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!*


*4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!*

*మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!*


*5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!*

*త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!*


*6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!*

*చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!*
 

*7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!*

*న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!!* 


*8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!*

*జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!*


*రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!*


*ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.*

🕉️🌞🌏🌙🌟🚩

*1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!*
*అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!*

*1) నిర్వాణ రూపమైన ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం, వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివసించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.*


*2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!*
*కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!*

*2) నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ), గిరిపై నివసించే వాడు, పర్వతములకు అధిపతి, కరాళుడు (దుష్ట శిక్షణలో), యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం), కృపాకరుడు, గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.*


*3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!*
*స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!*

*3) హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.*


*4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!*
*మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!*

*4) ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు, ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.*


*5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!*
*త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!*

*5) ప్రచండుడు (భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు, సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు, జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.*


*6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!*
*చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!*

*6) కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.*


*7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!*
*న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!!* 

*7) నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే పరమశివా! నన్ను అనుగ్రహించుము, అనుగ్రహించుము.*


*8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!*
*జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!*

*8) ఓ శంభో! నాకు యోగము, జపము, పూజ తెలియవు. కానీ, ఎల్లప్పుడూ నీ భక్తుడను. నేను ముసలి తనము, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను. ప్రభో! పాహి పాహి. శంభో! నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.*


*రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!*

*శివుని ప్రీతికి బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగును.*

*ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.*

🕉️🌞🌏🌙🌟🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat