అయ్యప్ప స్వామి దీక్ష నియమ నిబంధనలు Niyamalu


అయ్యప్ప స్వామి దీక్ష నియమ నిబంధనలు

🔯 అయ్యప్ప దీక్ష తీసుకోవాలని అనుకునే వారు 3 రోజుల ముందు నుంచి మాంసం కు, మద్యం కు దూరంగా ఉంటు  పరిశుభ్రంగా ఉండాలి.

🔯 దీక్ష తీసుకున్న తర్వాత నుంచి మీరు సాక్షాతు అయ్యప్ప స్వామి స్వరుపులు, కానుక మీరు అందరిని స్వామి అనే పదం తో పలకరిచాలి, కోపంగా ఎవరితోను మాట్లాడకుడాదు.
 (ముఖ్యంగా: కన్నే స్వాములు)

🔯 తెల్లవారుజామున 4 గంటలకు  నిద్ర లేవగానే కూర్చొని "స్వామియే శరణం అయ్యప్ప" అని మూడు సార్లు ఈ నామస్మరణం మనసులో అనుకుంటూ భూమాతను నమస్కారించాలి.

🔯 ప్రతిదినము చన్నీటితో శిరస్నానము చేసి పూజ విధానము ఆచరించి. దగ్గర లో ఉన్న దైవదర్శనాలు చేసుకోవలెను.
 సాయంత్రము కూడా శిరస్నానమాచరించి పూజ విధానము ఆచరించవలెను.

🔯 నల్లని దుస్తులు , ఆలయ ప్రాంతాల్లో ఉన్నప్పుడు పంచా,తువాలు మాత్రమే ధరించవలెను.

🔯 "స్వామియే శరణం అయ్యప్ప" అను మూలమంత్రము నిరంతరముగా జపిస్తూండవలెను.

🔯 బహిష్ఠు స్ర్తీలను,శవములను చూడరాదు, అనుకోకుండా చూసిన వెంటనే స్నానమాచరించి, శరణు. ఘోష చేయవలెను.

🔯 ప్రతి దినం ఒక్క పూట మాత్రమే ఆహారము భుజించాలి, రాత్రి పూట   పాలు,పండ్లు అల్పాహారం గా తీసుకోవాలి.

🔯 ప్రతి స్ర్తీ (భార్య సహితం) "మాత" లేదా "మాలికాపురం" అని సంబోధించవలెను.

🔯 ధీక్షాలమందు కేశఖండనగాని, గోళ్ళును తీయరాదు.

🔯 అయ్యప్ప ను ఎవరైన బిక్షకు పిలిచిన యెడల తిరస్కరించరాదు. జాతి , మత,కుల,వివక్షత అయ్యప్ప కు లేదు, సర్వులు సమానులు.

🔯 అయ్యప్ప స్వామి దీక్షలో నేల పై చాప వేసుకోని లేదా నల్లని గుడ్డ వేసుకొని శయనించవలెను.

🔯 అయ్యప్ప దీక్షలో ఎల్లప్పుడు విభూతి,చందనము,కుంకుమ తిలకములతో విలసిల్లవలెను.

🔯 పోగ మొదలగు ఉత్తేజిత పదార్థములు, తాంబూలాలు నిషిద్దములు.

🔯 ఎల్లప్పుడు సత్యము పలుకవలెను,అహింస పాటించావలెను, ఇంద్రేయ నిగ్రహము, బ్రహ్మచర్యము, ఆత్మసంయమనము, స్వయం క్రమశిక్షణ* కలిగియుండవలెను, క్రూరత్వము, గర్వము,కోపము, శత్రుత్వములు కపటములు లేకుండా వుండవలెను.

🔯 అయ్యప్ప దీక్ష గురు స్వాములు చెప్పిన కట్టిన నియమాలు పాటిస్తే అంతా పుణ్యం, మీ కోరికలు తీర్చే కొంగుబంగారమై మీ తోడైంటూడు అయ్యప్ప స్వామి.

🔯 గురుస్వాములకు ఎంత సేవ చేస్తే అంతా పుణ్యం.
 (ముఖ్యంగా: కన్నే స్వాములు)

🔯 ఏ పరిస్థితిలలోను *41దినములకు దీక్షాలము పూర్తియిన తర్వాతే ఇరుముడి కట్టుకోవలెను.

మీకు ఇంకా ఎమైన సందేహాలు ఉంటే మీ గురు స్వాములతో తెలుసుకోగలరు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

సర్వే జనఃసుఖినో భవంతు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!