ప్రార్ధన శ్లోకాలు :-
శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపర |
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః ||
1. అఖిల భువన దీపం భక్త చిత్తాబ్ది సూనం,
సురగణ మునిసేవ్యం తత్వమస్యాది లక్ష్యం |
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం,
శబరి గిరి నివాసం భావయే శ్రీభూతనాధం ||
2. అశ్యామ కోమల విశాల తనుం,
విచిత్ర వాసోవసాన మరునోత్పల వామహస్తం |
ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం,
శాస్తార మిష్ట వరదం శరణం ప్రపద్యే ||
3. ఓంకార రూపం జ్యోతిస్వరూపం,
పంపానది తీరం శ్రీ భూతనాధం |
శ్రీ దేవ దేవం చతుర్వేద సారం,
శ్రీ ధర్మశాస్త్రం మనసా స్మరామి ||
శ్రీ ధర్మశాస్త్రం మనసా స్మరామి,
శ్రీ ధర్మశాస్త్రం శిరసా నమామి.||
4. పరమాత్మ తేజం భవబంధ మోక్షం,
జ్యోతిస్వరూపం శోభాయమానం |
చిదానంద యోగేంద్ర చిన్ముద్ర హస్తం,
మణికంఠ నామం మనసా స్మరామి ||
5. మహాద్భుతం మౌణి గణాధినిషేవ్యం,
కృపాకరం భవ్య గుణాలవాలం |
దేవార్చితం దివ్య పాదారవిందం,
శ్రీ ధర్మశాస్త్రం మనసా స్మరామి ||
6. శ్రీ సుస్మితేందు వదనం శబరాద్రివాసం,
చిన్ముద్ర భూషిత కర వృతయోగ వట్టం |
వామాబ్జ హస్త పరిదర్శిత పాదపద్మం,
నౌమి ప్రభుం హరిహరాత్మజ మధ్భుతేశం ||