జనార్ధన్ గురుస్వామి / Janardhan Guru Swamy

P Madhav Kumar
మాతా పితృభ్యో నమః

         మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న పిట్టల జంగమ్మ, కీ.శే. రాములమ్మ, భర్త కీ.శే. సాయిలు ( ఇద్దరు భార్యలు) దంపతులకు 12 మంది సంతానం. అందులో నేను ఐదవ సంతానం నేను వారి కడుపున జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం.  నా చిన్నతనం నుంచే దైవ భక్తి, ఆధ్యాత్మికతను అలవరచిన  నా తల్లిదండ్రులే నాకు ఆది గురువులు.
             మాతృదేవోభవ             పితృదేవోభవ

                                                 జనార్ధన్ గురుస్వామి
                                                 సింహగిరి పాలమూరు.

ఓం శ్రీ గురుభ్యోనమః

          తమిళనాడు రాష్ట్రంలో రాయవెల్లూరు జిల్లా గోల్డెన్ టెంపుల్ నందు జన్మించిన కీ.శే.లు  శ్రీ శ్రీ శ్రీ సూర్య ప్రకాష్ గురు స్వామి గారు తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరం లో నివాసం ఉంటూ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ 1983 సంవత్సరంలో అయ్యప్ప మాల ధరించి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పెద్ద పాదం యాత్ర గావించి  35 సంవత్సరాలు శబరిగిరీషుని దర్శించుకున్నారు.   ప్రతి  సంవత్సరము  జై శబరీశా భక్త బృందం  అనే గ్రూపు తో సుమారు 60 మంది శిష్యుల వరకు హైదరాబాదులో ఇరుముడి కట్టుకొని రైలు మార్గం ద్వారా ప్రయాణించి కొట్టాయం లో దిగి ఎరుమేలి చేరి ధర్మ శాస్త్రాను దర్శించుకునేవారు. అక్కడి నుండి పెద్ద పాదము అడవి మార్గం సుమారు 72 కిలోమీటర్లు అడవి మధ్యలో అక్కడక్కడ మూడు రోజులపాటు బస చేస్తూ పంబా తీరంలో పడి పూజ మరియు పంప సత్తి చేసుకుంటారు. సాయంత్రం సన్నిధానం చేరుకొని నాల్గవ రోజు ఉదయం స్వామివారికి అభిషేకం, మంజు మాత దర్శనం చేసుకుంటారు. తిరుగు ప్రయాణంలో ఒక్కో సంవత్సరం ఒక్కొక్క యాత్ర చొప్పున దక్షిణ భారతదేశంలోని ఆలయాలను దర్శించుకుంటూ సుమారు పది రోజులకు ఇల్లు చేరుకునేవారు. ఎంతోమంది స్వాములతో ఇన్ని సంవత్సరాలు యాత్రలు చేసినా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా వెన్నంటే ఉంటూ అందరికీ తండ్రిలాగా ఆదరిస్తూ వచ్చిన ఈ ఘనత వారికే దక్కింది.
          గురుస్వామి ద్వారా మాల ధరించిన ఎంతోమంది అయ్యప్పలు ఇప్పుడు వారు గురు స్వాములు గా మంచి పేరు పొందినారు వారిలో లో నేను కూడా ఒకరిని. నా 22 వ ఏటనే మొదటిసారిగా 1989వ సంవత్సరంలో మాల ధరించి గురు స్వామి గారి శిష్యు డిగా చేరిన కొన్ని సంవత్సరంలోనే ప్రియ శిష్యుడిగా స్థానం దక్కింది. నాకు గురుస్వామి గారు గురువుగా లభించడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నాను. 

          గురువుగారు 30 అక్టోబరు 2018న పరమపదించారు. వారు ఏ  లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ..........
ఆచార్యదేవోభవ 

                                                 జనార్ధన్ గురుస్వామి
                                                 సింహగిరి పాలమూరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat