సందతంబు - సందతంబు / Sanda Tambu - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

సందతంబు - సందతంబు - సందసింబ హో
శబరిగిరియాత్ర చేయ సందతంబహో

కార్తీక మాసమందు కఠిన నిష్ఠతో
దీక్ష మాల వేయగా - కలుగు సందతం


శరణకోటి చేసుకొనుచు శబరిగిరి చేరగా
ఇరుముడిని దాల్చి వేగ ఎరుమేలిచేరగా


అడవివాని 'వేషమందు ఆడి పాడగా
దీవ్యమైన పంబానదిలో తీర్థమాడగా


శబరి పీఠమందు చేరి శరముగుచ్చుచుండగా -
పదునెనిమిది మెట్లెక్కి పరవశము చెందగా


నిష్ఠతోడ నెయ్యి తెచ్చి నీకు సమర్పించగా
అభిషేకము చేయునపుడు అలరారుచుండగా


తన్మయత్వమంది మదిని దర్శనార్థమై
స్వామియే శరణమనుచు శరణు వేడగా


దివ్యభూషణములు దాల్చి దర్శనంబు నీయగా
ఆ మకర సంక్రాంతి జ్యోతి చూసి మనసు విండగా









అయ్యప్ప శరణమనుచూ ఆర్తి మీరగా ..
స్వామియే శరణమనుచూ శరణు వేడగా
 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!