అన్నమయ్య కీర్తన నిగమ నిగమాంత వర్ణిత / Annamayya Keerthana

P Madhav Kumar


నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప-
నగరాజధరుడ శ్రీనారయణా ‖

దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య-
నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైనె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా ‖

చికాకుపడిన నా చిత్తశాంతము సేయ-
లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా ‖

వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీనారాయణా ‖

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat