1. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం
తా : లోకైక వీరులు మహాత్ములచే పూజలందు కొనువారు , సకల లోకములను సర్వవేళలా రక్షించువారు , కోరిన వారికి కోరినంత వరములను ప్రసాదించే ప్రభువు పార్వతిదేవి ప్రేమకు సంపూర్ణ పాత్రులు ధర్మాన్ని శాసించి నేర్పించువారు అయిన "శ్రీ ధర్మశాస్తా" వారిని నేను నమస్కరించు చున్నాను.
2. విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభో ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం
తా : విప్రులు అనగా మిక్కిలి శ్రేష్ఠులైన బ్రహ్మణోత్తములు. అట్టి విప్రులచే పూజింపబడు వారు , ఈ విశ్వమంత కొలిచేటి వారు , విష్ణు శివుల ప్రియ సుతుడు , ఎల్లవేళలా తనను శరణు వేడిన వారిని వెంటనే అనుగ్రహించి పాలించువారు అయిన " శ్రీ ధర్మశాస్తా" వారిని నేను నమస్కరించు చున్నాను.
3. మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం
తా : మదమెక్కిన ఏనుగు వంటి గంభీరనడక గలవారు భక్తులపై ప్రేమ కురిపించు వారు , తనను వేడుకొనిన వారికి ఎదురగు సర్వ విఘ్నములను తృటిలో తొలగించు డ్యూటీలో తొలగించు వారు , సర్వదేవతా స్వరూపులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
4. అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం
*తా : మన కులదైవమై మనలను సదా కాపాడు ఈశ్వరుడు మనలో యుండెటి కామ క్రోధాదులనబడు ఆరు శత్రువులను లేకుండా చేసి , మనలను పునీతులుగావించగల మన యిష్టా యిష్టములను తెలుసుకొని కొరవడిలేక వరములను కురిపించు వారు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.*
_*5. పాండ్యేశవంశ తిలకం భారతీ కేళి విగ్రహం*_
_*ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం*_
*తా : పాండ్య వంశమునకు తిలకము వంటి వారు , కేరళ దేశమున పసిబాలుడై వెలసి ఎన్నో లీలా వినోదములను చూపించి , అచ్చటి వారికి ఆనందమును కల్గించినవారు , ఆపదలో చిక్కుకొని అలమటించే భక్తులను కాపాడుటలో సాటిలేనివారు , దేవాది దేవుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను*
6. పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
యస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే
తా : శాస్తా పంచరత్న స్తోత్రమను పేరుగల ఈ శ్లోకములను శుద్ధుడై నిత్యము పఠించు మానవునికి అయ్యప్ప దేవుడు ప్రసన్నుడై , వాని మనస్సున సదా నివశించును.
7. త్రియంబక పూరాదీశం గణాధిప సమన్వితం గజారూడ మహం వందే శాస్తరం కుల దైవతం
తా : త్రయంబక పురమనబడు దివ్య స్థానమునకు అధిపతియగు , గణాధిపుడైన గణపతితో సమముగా కైలాసమునందుండు వారు , ఏనుగు మీదెక్కి వచ్చి భక్తుల కోర్కెలను తీర్చే వారు , మన కులదైవ సమానులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
8. యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శస్తర మహం వందే మహావైద్యం దయానిధిం
తా : లోకులకు అమృతమును పంచిపెట్టిన అపర ధన్వంత్రియగు మహావిష్ణువును తల్లిగాను , వైద్యుల కెల్ల వైద్యనాథుడైన పరమేశ్వరుని తండ్రిగాను , పొందిన మహా వైద్యోశ్వరులు , దయానిధియు అయినట్టి " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
9. అరుణోదయ సంకాశం నీలకుండల ధారిణం
నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మ నందనం
తా : అరుణోదయ కాంతిలా మెరుస్తుండు వారు , కర్ణములందు నీలి రత్నం పొదిగిన కుండలములను ధరించి యుండు వారు , నీలి వస్త్రములను ధరించు వారు , పరబ్రహ్మమయమైన వారు , బ్రహ్మపుత్రుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
10. చాప బాణం వామహాస్తే రౌభ్య వేత్రం చ దక్షిణే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం
తా : ధర్మహీనులను శాసించు వాడను నేనే అనునట్లు తన కుడి హస్తములో విల్లంబు దాల్చి , ఎడ మకర మందు వెండి దండమును పెట్టుకొని ధగ ధగ మెరిసే మేలుజాతి వజ్రములు పొదిగిన కుండలములు తదితర ఆభరణములు ధరించి ప్రశోభిల్లు వారు , శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియసుతులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను
11.వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
వీరపట్టధరం ఘోరం వందేహం శంభు నందనం
తా : శత్రువులపై నన్ను కోపము వలన ఎరుపెక్కిన నయనములతో వార్లను హతమార్చుటకు బెబ్బులి మీద అమరియుండు వారు , పట్ట బంధం కట్టి రత్నహారములనే కవచములుగా దాల్చి దుష్ట సంహారమొనర్చు వీరాధి వీరులు , పరమ శివుని ప్రియ సుతులు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
12. కింకిణోద్యాణ భూతేశం పూర్ణచంద్ర నిభాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
తా : కింకిణి కిణికిణి యని శబ్దంచేసే చిన్ని చిన్ని గజ్జలు తొడిగిన మేఘాలను నడుమ ధరించి యుండువారు , పూర్ణ చంద్రుని కాంతిని పోలిన ముఖవర్ఛస్సు గలవారు , అతి భయంకరమైన అడవి వీరుని రూపమున నడయాడు వారు పాండ్యవంశీయులను ఉద్ధరించుట కొరకై వారి యిష్టపుత్రుడై యుండి వారిని పావనులు గావించిన వారు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
13.భూత భేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసనం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం
తా : భూత భేతాలు ఎల్లప్పుడు నమస్కరించుచుండు పాదములు గలవారు కాంతమల శిఖరాన యుండు స్వర్ణమందిరములో నివసించువారు , మణికంఠుడు అనిలోకులచే సుప్రసిద్ధముగా కొనియాడబడేవారు , పరాశక్తికి మిక్కిలి ఇష్టమైన పుత్రుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
14. శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం
శబరీ గిర్రిశ్వరం దేవం నమామి భూతనాయకం
తా : దేవా ! శ్రీహరి పుత్రుడవు , హరిహారాత్ముల సంజాతుడువు , శబరీ శిఖిరాన వెలుగొందు సర్వ భూతాదిపా ! శరణం శరణం.
15. జగత్ ప్రియం జగన్నాథం జగదానంద దాయకం
జగదీశం కృపా పూర్ణం నమామి మోహనీ సుతం
తా : లోకమునకు ప్రియము గూర్చువాడును , జగత్తునకు ప్రభువును , సర్వ లోకములకు ఆనందము కలిగించువాడును , జగదీశ్వరుడును , కృపాగుణముచే నిండినవాడును , మోహిని కుమారుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
16. భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం
తా : సకల భూతనాధుడును , తారక బ్రహ్మస్వరూపుడును , గిరీశుడును , పార్వతినందనుడును , పరమేశ్వర పుత్రుడును , సర్వపాపములను నాశనముచేయువాడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
17.జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం
వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం
తా : జనార్ధనకుమారుడును , ఆటవిక వేషము ధరించినవాడును , మనోహరుడును , అరణ్య నివాసమునందు ప్రేమగలవాడును , జగన్నాధుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
18.పాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం
బాలరూపం లోకనాధం నమామి శభరీశ్వరం
తా : ముక్కంటి కొడుకును , కలిదోషమూలను నాశనము చేయువాడును , బాలరూపమున నుండువాడును , లోకనాయకుడును , శబరిగిరీశ్వరుడు అయిన " శ్రీ ధర్మశాస్తా " వారిని నేను నమస్కరించు చున్నాను.
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః
తా : భూత ప్రేత పిశాచములకు నాధుడై వాటి శల్యమును అరికట్టి పాలించు ఓ భూతనాథ సదా ఆనంద చిత్తము లో యుండు వాడా , సృష్టిలోని సర్వభూతరాశుల యందు ఎనలేని దయగల్గిన పరాత్పరా , పై చెప్పబడిన రీతిగాను , ఇంకను నా మతి కందని పలు దివ్య శక్తులు గల్గిన శక్తి పుత్రా ! హే ధర్మశాస్తా మిమ్ములను త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను. బహు బలము నిండిన ఓ మహా ప్రభో ! మమ్ములను సదా రక్షించి పాలించ వలెను.