మనకి వైపల్యాలు ఉన్నా, ఇబ్బందులు వచ్చినా కుంగిపోకూడదు. అలాగే ప్రతిభ ఉందని పొంగిపోకూడదు. ఈ రెండు విషయాలనీ మనకి చెప్పే అష్టావక్రుని కథ ఇది...
పూర్వం మిథిలా నగరానికి కొద్ది దూరంలో ఉన్న అరణ్యంలో ఏకపాదుడనే గురువు ఉండేవాడు. అతని ప్రతిభ విని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో పిల్లలు వచ్చి ఆయన వద్ద విద్యను అభ్యసించేవారు.
ఆదే అడవిలో కొంచెం దూరంలో ఉద్దాలకుడనే ముని ఉండేవాడు. అతనికి సౌందర్యవతి, గుణవతి అయిన సుజాత అనే చెల్లెలుండేది. ఏకపాదుని పాండిత్యం గురించి విని ఆతనికి సుజాతనిచ్చి పెళ్లి చేస్తాడు ఉద్దాలకుడు. ఏకపాదుని దగ్గర ఉన్న విద్యార్దులను చూసి సుజాతక్కూడా వేద, వేదాంగాలు నేర్చుకోవాలనే కోరిక కలిగింది. విద్యార్థులకు కాస్త దూరంలో కూర్చొని, భర్త చెబుతున్న పాఠాలు వింటూ ఉండేది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా తండ్రి చెప్పిన పాఠాలు వింటూండేవాడ్తు,
ప్రతిరోజూ ఏకపాదుని గురుకులంలో కొత్త పిల్లలు వచ్చి చేరేవారు. తన ప్రతిభ వల్లనే ఆధిక సంఖ్యలో పిల్లలు తన గురుత్వం స్వేకరిస్తున్నారని ఆతనికి గర్వం ఆవహించింది. శోకాలను ఉచ్చరించేటప్పుడు తప్పులు దొర్లినా అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయినా వారిని కఠినంగా శిక్షించేవాడు. ఆ శిక్షలకు పసి బాలురు ఎంతో తల్లడిల్లిపోయేవారు.
గురుపత్ని గర్భంలోని శిశువు వాళ్ల మనోభావాన్ని ఆర్థం చేసుకొని ఒకనాడు “తండ్రీ, నీ కోపతాపాలకు, కఠిన శిక్షలకు శిష్యులు బాధపడుతున్నారు. కాబట్టి వారి పట్ల సౌమ్యంగా ప్రవర్తించు” అని తల్లి గర్భంలో నుంచి బయటకు వినపడే విధంగా వేడుకున్నాడు.
ఆ హితబోధను ఆవమానంగా భావించిన ఏకపాదుడు "తల్లి గర్భంలోంచే, నాకు నీతులు చెప్పేటంతటి గొప్పవాడివా? ఇందుకు శిక్షగా ఆష్టవంకరలతో జన్మిస్తావు గాక" అని శపించాడు.
ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత, జనక మహారాజు ఎదుట తన పాండిత్యాన్ని ప్రదర్శించి, ఇతనిచ్చే ధన ధాన్యాలను తీసుకువస్తానని భార్యకు చెప్పి మిథిలా నగరానికి బయల్దేరాడు ఏకపాదుడు.
తన ఆస్థానంలో ఉన్న 'వంది' అనే పండితుడిని శాస్త్ర చర్చల్లో ఓడిస్తే ఘనంగా సన్మానం జరుగుతుందని, ఓడిపోయిన పక్షంలో వంది విధించే శిక్షను అనుభవించవలసి ఉంటుందని హెచ్చరిస్తాడు జనక మహారాజు.
షరతుకి అంగీకరించిన ఏకపాదుడు చర్చలో ఓడిపోయి, శిక్ష అనుభవించటానికి సిద్ధమవ్వగా, వంది అతన్ని నీటిలో ముంచి దిగృంధనం చేస్తాడు. అప్పటికే చాలామంది పండితులు ఆ శిక్షను అనుభవిస్తుంటారు. తన అహంకారానికి, తొందరపాటుకి ఇటువంటి శిక్ష సరైందేనని విచారిస్తాడు ఏకపాదుడు.
ఎన్నాళ్లు గడిచినా భర్త తిరిగిరాక పోయేసరికి, విద్యార్థలందరినీ తమతమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపొమ్మని చెప్పి సుజాత తన అన్నగారైన ఉద్దాలకుడి ఇంటికి చేరుకుంటుంది. కొన్నాళ్ల తరువాత ఆమెకు ఒక మగశిశువు జన్మిస్తాడు. ఆ బిడ్డ శరీర భాగాలన్నీ ఎన్నో వంకరలతో ఉంటాయి. ఉద్దాలకుడు ఆ బాలుడిని 'అష్టావక్రుడ'ని నామకరణం చేసి తన కొడుకు విశ్వకేతువుతో సమానంగా "పెంచుతూ అన్ని విద్యల్లో పారంగతుణ్ని చేశాడు. ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిన తరువాత, ఆష్టావక్రుడిని తండ్రిలేని వాడని విశ్వకేతువు హేళన చేస్తాడు.
దాంతో తన తండ్రి గురుంచి చెప్పమని తల్లిని పదే పదే అడుగుతాడు.
జనక మహారాజు కొలువుకి వెళ్లి, ఇంతవరకూ తిరిగి రాలేదని, ఏమయ్యిందీ తెలియదని ఆమె దుఃఖిస్తూ చెప్పగానే, తల్లి, మేనమామల అనుమతి, ఆశీర్వాదాలు తీసుకొని రాచనగరుకి ప్రయాణమవుతాడు
రాజదర్భారులో జరిగిందంతా తెలుసుకొని తనకు కూడా ఒక అవకాశమిమ్మని రాజుని, వందిని ప్రార్థిస్తాడు అష్టావక్రుడు. బాలుడి ఆకారం, వయసు చూసి వంది మొదట సందేహించినా ఆతని వినయానికి సంతోషించి, చివరకు ఒప్పుకుంటాడు వంది. అలా మొదలైన శాస్త్ర చర్చలో ఇద్దరూ సమవుజ్ణీలుగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.
చివరగా సమస్యాపురాణంలో అష్టావక్రుడు విజయం సాధించగా వంది తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించి, విజేత బాలుడు కాబట్టి దీవిస్తాడు.
తన తండ్రితోపాటు మిగతా పండితులందరికీ విముక్తి కలిగించమన్న అష్టావక్రుని కోరికను సంతోషంగా అంగీకరిస్తాడు వంది. జనకుడి కోరికను మన్నించి, ఆస్థాన పండితుడిగా ఉండిపోతాడు