Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

05. శివుడే దేవుడని నేనంటే / Shivude Devudani - శివ భజన పాటల లిరిక్స్

"శివుడేదేవుడని"
"పరమశివుడనినేనంటే"2" 
పాములాడిస్తడని నిన్నంటారు 
పాములాగరడని నినంటారు 
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ 
శివయ్యా శివయ్యా నాకేమి తెలియదయ్యా

"శివుడేదేవుడని"
"గరళకంఠుడనినేనంటే"2" 
 గంగిరెద్దులోడని నిన్నంటారు 
 గంగిరెడ్లగాస్తడని నిన్నంటారు 
శివయ్యా శివయ్యా శివయ్య నీ మాయ 
శివయ్యా శివయ్యా ఎవరు తెలియరయ్యా

"శివుడేదేవుడని"
"కాశి విశ్వనాథుడని నేనంటే" 
కాటిలోపండ్తడని నిన్నంటారు 
కాటికాపలా అని నిన్నంటారు 
శివయ్యా శివయ్యా శివయ్య నీమాయ 
శివయ్యా శివయ్యా ఎవరుతెలియరయ్యా

"శివుడేదేవుడని"
"పుడితేపుట్టాలి హిందువుగా 
భారతదేశపుపౌరుడిగా"2" 
బలిబలి బలిబలి భజరంగీ 
జైబోజైబోలో భజరంగీ 
కులమతా భేదాలనువీడాలి 
మనమంతా ఏకమైఉండాలి 
బలిబలి బలిబలి భజరంగీ 
జైబోలోజైబోలో భజరంగీ 
కరసేవకులై కదలాలి 
సనాతనా ధర్మాన్ని నిలపాలి


శివుడే దేవుడని నేనంటే

శివుడు దేవుడు కాదంటారు

(సదాశివతత్త్వం అందరికీ అంత సులభంగా అర్థంగాదు)




శివుడే గరళ కంఠుడని నేను అంటే

గంగిరెద్దు లోడు అని నిన్ను అంటారు

గంగిరెద్దులు కాస్తాడని నిన్ను అంటారు

(గరళమును కంఠమున నిల్పి సర్వులోకాలను,సమస్తదేవతా మునిజనులనుసదారక్షించున్న వాడు,ధర్మానికి సంకేతమైన గంగిరెద్దుమీద దశదిక్కుల సదా సంచరించుచూ గంగిరెద్దులమైన మనలను సదా కాస్తున్నవాడు

సదాశివుడేనని సదాశివత్త్వంబు ఎఱిగినవారు తప్ప ఇతరులు గ్రహించలేరు.)




శివుడే కాశీ విశ్వనాధుడు అని నేను అంటే

కాటిలో పంటాడు అని నిన్ను అంటారు

కాటి కాపరోడు అని నిన్ను అంటారు

(కాశీయే మహాశ్మశానమని అందుగల కాటికాపరియే కాశీ విశ్వనాధుడని,కాటికి చేరినవారికి ప్రత్యేకించి కాశీలో తుదిశ్వాస విడుచుసమయాన కుడి కర్ణికలో ప్రణవోపదేశము జేసి ముక్తి ప్రసాదించువాడు ఆ స్వామియే

అని అంతఃకరణమున సదాశివా తత్త్వంబు తెలిసినవారికి తప్ప అన్యులెవరికి తెలుస్తుంది సదాశివ మాయ

ఎవరేమనుకొంటే ఏమిఅది నీకూ నాకూ తెలుసు అదే నీవు జేసే మాయేయని సదాశివా! )
📢 Follow