ఆ గుడిలో విగ్రహాలు మాట్లాడతాయట.......⁉️

P Madhav Kumar


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️


రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!

ఏమీ మాట్లాడకుండా, కదలకుండా అలా ఓ క్షణం ఆగిపోయిన వారిని..ఏంటి స్పందించవు రాయిలా అంటారు. 


మరి విగ్రహాలు మాట్లాడితే...


మనదేశంలో ప్రతి ఆలయానికి ఓ చరిత్ర ఉంది, ఓ విశిష్టత, ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాల్లో సైన్స్ కి అందని రహస్యాలెన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏంజరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి. 


అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తర్ లో ఉన్న రాజేశ్వరీ ఆలయం. 


ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మాట్లాడతారట.


 అంటే ఏ మనిషికో పూని మాట్లాడటం కాదు స్వయంగా అమ్మవారి విగ్రహం నుచి మాటలు వినిపిస్తాయట.


అవును మీరు చదువుతున్నది నిజమే. 


అక్కడి స్థానిప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట.ఈ తాంత్రిక భవానీ మిశ్రా వంశస్తులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారని స్థానిక ప్రజలతో పాటు దుర్గామాత భక్తులు నమ్ముతారు.ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి చూడగా ఆ విషయం పై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు(అర్ధం కానీ మాటలు) మాత్రం అంతుపట్టడం లేదు. అంతేకాక కొంత మంది వైజ్ఞానిక వేత్తలు ఈ విషయం తెలుసుకోటానికి వెళ్ళిన వారికి కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు.


అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా ఈ ఆలయం నిర్మించి ఉంటారని స్థానికులు చెపుతున్నారు. తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు.


ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతారన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణిమ తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబుతారు.అందువల్లే రాత్రి సమయంలోనే కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్లడానికి చాలా మంది భయపడేవారు. అయితే పగలు మాత్రం ఇక్కడ పూజరులు పూజలు నిర్వహిస్తారు.


బీహార్‌.. తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది. 400 ఏళ్లక్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు.తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం.. రాత్రి వేళల్లో మాత్రం గుండె దడ పెంచుతుంది.ఇక్కడ రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయప్రాంగణంలో బతుకు బహీరవ, దత్తాత్రే భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ, మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి, తారా విగ్రహాలు కూడా ఉన్నాయి. 


ఈ ఆలయంలో ఉన్న కొన్ని రాతి శాసనాల్లో కూడా ఈ విషయం ఉంది.దీనితో పాటు చాలా ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడుతారని చెబుతారు.అది కూడా అర్థ రాత్రి తర్వాత మాత్రమే ఈ సంభాషణ జరుగుతుందని వారు చెబుతారు. కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా ఆ మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.వీరిలో చాలా మంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు చెబుతారు. ఇక ఈ విషయం తెలుసుకొన్న కొంతమంది స్వతహాగా ఆ మాటలను వినడానికి ప్రయత్నించారు కూడా.ఇందు కోసం అక్కడ తరతరాలుగా అర్చకత్వాన్నినిర్వహిస్తున్నవారితో ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 


ఈ విషయం పై ఆ నోట ఈ నోట కొంతమంది హేతువాదులకు కూడా తెలిసింది.వీరు శాస్త్రవేత్తలతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శాస్త్రవేత్తలు కూడా ఆ విగ్రహం నుంచి మాటలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు.అయితే కాని అవి ఎందుకు వస్తున్నాయన్న కారణాన్ని మాత్రం వివరించలేకపోతున్నారు. 


కాని దేవత నుండి ఆశీర్వాదం కోరడానికి చాలామంది భక్తులు దీర్ఘకాలంలో నిలబడి ఉండటం అంతిమ భక్తికి చిహ్నంగా ఉంటుంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat