#తరతరాలుగా మనం వింటున్న - క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు*

P Madhav Kumar



#1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

#2. ఒంటి కాలీపై నిలబడ రాదు.

#3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు.

#4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు.

#5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి.

#6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

#7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు.

#8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు.

#9. పెరుగును ఉప్పును అప్పు ఇవ్వ రాదు.

#10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాదు.

#11. భోజనం మధ్యలో లేచి పోరాదు.

#12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.

#13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.

#14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవు ఊడ్చరాదు.

#15. గోడలకు పాదం ఆనించి పడుకో రాదు.

#16. రాత్రీ వేళలో బట్టలుతక రాదు.

#17. విరిగిన గాజులు వేసుకోరాదు.

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి.

19. చేతి గోళ్ళను కొరకరాదు.

20. అన్న- తమ్ముడు, తండ్రి - కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాదు.

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు.

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు.

23. భోజనం తరువాత చేతిని ఎండ పెట్టవద్దు.

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు.

25. ఇంటి గడపపై కూర్చోరాదు.

26. తిన్న తక్షణమే పడుకోరాదు.

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు.

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు.

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి.

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు.

31. అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు.

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు.

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు.

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు.

35. ఇంటి లోపలికి చెప్పులు (Shoes) ధరించి రారాదు.

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి.

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు.

#39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు.

#40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు.

#41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు.

#42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు‌ లాంటివి వదిలించుకోవాలి.

#43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

#44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి.

#45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

#46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.


       మీరు, మీ అధికారం, ఏవీ శాశ్వతం కావు; ఇతరులను ఎదగనివ్వండి; మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.


మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకో


🌹🌹🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat