*కాశీకి వెళ్ళినా రామా హరీ,

P Madhav Kumar

 *కాశీకి వెళ్ళినా రామా హరీ, ఇంటి మోహాలు పోలేదు రామ హరీ! దేహ సౌఖ్యాలు పోలేదు రామా హరీ*




ఈ రోజుల్లో చాలా మందిని చూస్తుంటాము, ఎందుకు గుళ్ళకు తీర్ధ యాత్రలకు వెళతారో, అక్కడి స్థల కధ తెలుసుకుని, దేవుని గుణ సంపద నేర్చుకుని, ఆచరిస్తూ ఉంటే, వారిలో ఇన్నాళ్ళు గా ఏమి మార్పు వచ్చిందో, మనకే కాదు, వారికి వాళ్ళ ఇంట్లో వారికి కూడా తెలీదండోయ్. అప్పుడు అది తీర్ధ యాత్ర కాదు, విహార యాత్ర అవుతుంది, ఫలితం శూన్యం.  


ఏవండోయ్ మేము 34 వ సారి, తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము. 12 లడ్డూలు తెచ్చి పంచాము, మేనేజర్లు మనకు పనికి వచ్చేవారికి. కాశీ రామేశ్వరం కంచి కైలాసం, అలా అలా టూర్ కి వెళ్ళి, నంది కొమ్ముల నుంచి పరమేశ్వరుని చూసి, ఊరక వచ్చిన ధనం ఓ 50 వేలు ఇంటిల్లి పాదీ, వదిలించి వచ్చాము, 25 వ సారి.


కొన్ని సార్లు ఇతరులు దయా ధర్మముగా, ఉచితముగా టికెట్ ఇస్తామన్నా, అందరం పోలో మంటూ పరుగులు తీసాము, ఉచిత భోజనం ప్రయాణం కదా. ఇంట్లో సమస్యల నుంచి తాత్కాలికముగా తప్పించుకోవడానికి, ఊళ్ళెమ్మట తిరుగుతూ పొద్దు పుచ్చడానికి, భలే ఉంటుంది కదూ? 


ఎక్కడ చూసినా, ఇసకేస్తే రాలనంత జనం. మరి పాపం, కలియుగం లో 80 శాతం నుంచి, కిందకు దిగను గాక దిగను అంటుంది. ఎక్కడ చూసినా, కల్తీలు నటన కపటం, తగ్గడం లేదు.   


దానం ఇచ్చే వారికి, అలాగే గ్రహీత కు అర్హతలు ఉంటాయని, వీరికి వారికి ఇద్దరికీ తెలీదు. అంటే, ఇంకా పాపం మూట గట్టుకుంటారు. దొంగల ధనం, దొంగల పాలే. తప్పుడు సంపాదన, తప్పుడు వారి పాలే.


అక్కడ మట్టి తెచ్చి ఇక్కడ, ఇక్కడ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ, వదిలి వచ్చాము అంటారు గొప్పగా. అంతేనా ఇంకేమైనా మానసిక దరిద్రాన్ని, వదిలారా? మీలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే, అదేమిటీ ఎక్కడైనా, చార్జీలు దాతలు రుచులు ఖర్చులు సౌకర్యాలు మారతాయి ఏమో.


కానీ, మా వంశ పెంపక అలవాట్లు, మేమెందుకు మార్చుకుంటాము, ఉదయం సూర్యుడు వచ్చిన తర్వాత 7 తర్వాత లెగవాల్సిందే, బయట హోటల్ ఇడ్లీ చట్నీ రావాల్సిందే, ముక్క లేకుండా భోజనము దిగదు, తీర్ధం తాగకుండా నిద్ర పట్టదు అంటారు.  


మధ్యలో వీలైతే ఇంటి పక్కన వారితో, ఇంట్లో కోడలు అత్తతో, మొగుడు మామతో, కొట్లాట పోట్లాట, 10 మంది వచ్చి సర్ది చెప్పినదాకా. 10 చీట్లు వేసి లేదా 10 అప్పులు చేసి, మీసాలకు లేదా జడకు సంపెంగ నూనె రాయనిదే, ఆడంబరాలు ఆర్భాటాలు లేనిదే, తిన్నది అరగదు. పొదుపు సర్దుబాటు అంటే కుదరదు, అప్పు చేసి పప్పు కూడే. వ్యాసాలు వ్యసనాలు ఉపన్యాసాలు బారెడు, ఆచరణ లో మాత్రం మూరెడు.


కులం వర్గం అవసరం నోటుకు మాత్రమే ఓటు. అబద్దాలు అలవోకగా, 10 ఏళ్ళ నుంచే. కొత్త సినిమా మొదటి నెలలోనే చూడాలి, బయట తిండి రుచులు మానం, కొత్త ఫోన్ బైకు కారు తగ్గం. ఇంట్లో పనులు చెయ్యం, ఒళ్ళు తగ్గించం. నిండు బట్టలు కట్టం, మేకప్ లేకుండా బయటకి రాము. ముదుసలి అమ్మ నాన్న అత్త మామను ఇంట్లో ఉంచం, ఉంచినా మాతో గౌరవముగా బాధ్యతగా తిప్పం. పిల్లల సంస్కార బాధ్యత మాది కాదు. మా ప్రాపంచిక మోహ లక్షణాలు ఏవీ మార్చుకోం.  


మరి ఇన్ని యాత్రలు చేస్తే, శివుని వైరాగ్యం ఏది? వినాయక ప్రదక్షిణాలు పాద పూజ ఏవి, తల్లి దండ్రులకు? విష్ణువు పాద సేవ ఏది, బ్రుగు మహర్షికి? రాముడు సీతల సౌకర్యాలు లేని కందమూలాల సామాన్య జీవితం ఏది? సామాన్యులైన, గోవులు కాసే వారితో, క్రిష్ణుని స్నేహజీవితం ఏది? బీద కుచేలునికి, క్రిష్ణ కానుకలు ఏవి? ధర్మం కోసం, క్రిష్ణ రామ యుద్దం ఏది?


తిరుమల వెంకన్న, ఇంతమంది గోడు విని, సహాయం చేస్తుంటే, మనము ఎవరి బాధ వినడానికి సహాయానికి సమయం లేదు, ఫుల్ల్ బిజీ అంటాము కదా? అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు అసలు విడువము కదా? ఇంక మనము భక్తులము ఎలా అవుతాము, ఈ యాత్రల వలన మనలో మార్పు శున్యం? అంటే చేదు దోసకాయ తీర్ధాలలో ముంచినా చేదు మారదు. కుక్క తోక వంకరే. వ్రుధా ప్రయాసేనా? వరాహం, బురద సువాసన విడుస్తుందా?   


చిత్తశుద్దితో, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వదిలేది ఎప్పుడు? సజీవ గురు సేవ ఎప్పుడు? దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని, మనము దేవుడు గా మారి, కనీసం మనిషి గా మారి, పరమాత్మతో కలిసేది ఎప్పుడూ? ఎన్ని జన్మలకు? అర్హత సాధన ధ్యానం మననం లేకుండా, సంపాదించకుండా, ఎన్ని గుళ్ళు యాత్రలు బడులు కాలేజీలు తిరిగినా, ఫలితం ఉంటుందా?  


భగవంతునికి ఇష్టమైన 8 ఉచిత మానసిక పుష్పాలు తో పూజ చేస్తున్నామా రోజూ? 1. అహింసా 2. ఇంద్రియ నిగ్రహం 3. దయ 4. క్షమ 5. ధ్యానం/శాంతి 6. తపస్సు 7. జ్ఞానం 8. సత్యం. అబ్బే అవి మనకు అసలు కుదరదు అండి, ఎందుకంటే, ముదుసలి అమ్మా నాన్న అత్త మామ లేదా తెలిసిన పెద్దవారిని, మా ఇంట్లో అసలు ఉంచి గౌరవముగా చూడము కదా. తూచ్.    


కాశీకి పోయాను రామా హరీ! 

గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ! (2)

కాశీకి వెళ్ళినా రామా హరీ, 

ఇంటి మోహాలు పోలేదు రామ హరీ! 

దేహ సౌఖ్యాలు పోలేదు రామా హరీ! . . .


మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat