Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కైలాసమే కాపురమా / Kailasame kapurama - శివ భజన పాటల లిరిక్స్


కైలాసమే కాపురమా - శ్రీశైలం సింహద్వారమా

వెండికొండపై నివాసముండే భోళా మల్లన్నా 

భోళా మల్లన్నా శ్రీశైల మల్లన్నా

మువ్వల మల్లన్నా మెడలో నాగుల మల్లన్నా 


ఒక ప్రక్క గణపయ్య మరోపక్క మురుగయ్య

ఇద్దరు కొడుకుల ముద్దుల తండ్రివి  నీవే మల్లన్న

!!భోళా మల్లన్నా!! కైలాసమే

 

తల పైన గంగమ్మ పక్కనేమో పార్వతమ్మ,

ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న  

!!భోళా మల్లన్నా!! కైలాసమే

 

పులిచర్మము ధరియించిబిక్షాటన చేసితివయ్యా 

వల్లకాటిలో నివాసముండే విభూతి మల్లన్నా

!!భోళా మల్లన్నా!! కైలాసమే

గరళాన్ని గొంతులో దాచిన గరళా కంటుడవు నీవే

ఆది అంతముల లయకారకుడవు నీవే మల్లన్న

!!భోళా మల్లన్నా!! కైలాసమే



📢 Follow