శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

P Madhav Kumar
**

మనకు విద్య ఉండాలి అంటే, సరస్వతీ తల్లి దీవెన ఉండాలి. అప్పుడు మనము స్పష్టముగా వాక్సుద్దితో మాట్లాడ గలము పాడ గలము పాడాలి, అలాగే సొంతగా అనుభవాలు కనీసం మాత్రుభాషలో మంచి పదాలతో రాయగలము, వీటికి అమ్మ వారి దయ ఉండాలి. 

విద్యను ఎన్నడూ ఎవరూ దొంగిలించలేరు. చూసారు కదా 1600 కధనాలు రాసినా, ఇంకా ఎవో మనసుకు వస్తూనే ఉంటాయి. అలాగే 300 సొంత గొంతు పాటలు పాడినా, ఇంకా ఎన్నో పాడాలి పాడగలము. అది మానసిక అలాగే శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

విద్య ఉంటే, ధనం అదే వస్తుంది, అలాగే మనతో నిలుస్తుంది. విద్య లేకుండా, ధనం ఉంటే, అది తప్పక పతనము అవుతుంది. విద్య అంటే కేవలం బడి చదువు కాదు, బతుకు కోసం ఉద్యోగానికి ఉపయోగపడేది మాత్రమే కాదు, మనసును నియంత్రించి అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించే అధ్యాత్మిక ఆత్మ విద్య సుమీ.   

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || 1 ||

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || 2 ||

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || 3 ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || 4 ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || 5 ||

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి పాడ/ జపించ ప్రయత్నించగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ధైరాయిడ్, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి, ఆధ్యాత్మికతకు, పూజకు.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat