జై శబరీష భక్త బృందం - అధ్యక్షులు - పూజ్యులు
శ్రీ శ్రీ జనార్ధన్ గురు స్వామి గారి మాటల్లో....
ఇరుముడి కట్టాలి అంటే ముందుగా
1. ఇరుముడి కట్టే స్వామి కానీసం 5 సార్లు దీక్ష పూర్తి చేసి ఉండాలి.
ఇరుముడి కట్టడానికి కావలసిన అర్హత ఏమిటి?
2. మద్యం - మాంస, దురలవాట్లకు దూరంగా ఉండాలి (ఎందుకంటె ఇరుముడి అనేది చాలా పవిత్రమైనది కనుక అంతటి పవిత్రమైన ఇరుముడి ఆ హరిహర సుతునికి అర్పించడం జరుగుతుంది. కావున మనం కూడా అలాగే పవిత్రంగా ఉండాలి)
3. నలుగురిలో సంభాషించే సామర్థ్యం కలిగి ఉండాలి. ( ఇది ఎందుకంటె సమావేశాలు, ఇతర కార్యక్రమాలలో గురువు మాట్లాడే అవసరం ఉంటుంది)
4. ఎటువంటి దీక్ష స్వీకరించిన, ఆ దీక్షకు సంబందించిన విషయాలు, నియమాలు, కథలు, పూజలు, పురాణాలు మొదలైనవి కొంత వరకన్న తెలిసి ఉండాలి.
5. నిజ జీవితంలో కూడా *తత్వం అసి* అనే భావనతో - ఏదైనప్పటికీ అన్నియు ఆ భగవంతుడే అనే గొప్ప మనసు, ఆచరణ వుండాలి
6. ఎవరిని కూడా దూషించరాడు. దుర్భాషలు మాట్లాడ కూడదు
.7. దీక్ష తీసుకున్న స్వాములు ఇరుముడి కట్టే స్వామిని తమకు తాముగా ఎంచుకునే విధంగా అన్ని రంగాలలో , కార్యక్రమాలలో మన ప్రవర్తన వుండాలి..
8. ఇవి అన్ని లక్షణాలను అలవరచుకున్న కూడా తమ గురువు ఆజ్ఞ లేకుండా ఇరుముడి కట్టకూడదు. ముందుగా గురువు ఆదేశం, ఆశీర్వాదం ఇరుముడి కట్టడానికి చాలా అవసరం.
9. అన్నింటికీ మించి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే: సంతోషం, బాధలను కూడా సమానంగా స్వీకరించాలి. గురువు గా తమ సంతోషాన్ని శిష్యులకు పంచాలి.
.