🌹🌹నందీశ్వరుని తండ్రి పేరు #శిలాదుడు.
ఆయనకు చాలా కాలంగా సంతాన భాగ్యం లేకపోతే #శివదీక్ష చేత నందీశ్వరుడు జన్మించాడు.
నందీశ్వరుడు సకల గుణ సంపన్నుడు.
కానీ ఒక రోజు #నారద_మహర్షి ఈ బాలుడు #అల్పాయుష్కుడు అని శిలాదుడుకి చెప్తాడు.
అప్పుడు శిలాదుడు అల్పాయుష్కుడైన నందీశ్వరునకు నీవు శివదీక్ష నియమ నిష్ఠలతో స్వీకరించి,ఆత్మార్పణ గావించు అని ఉపదేశిస్తాడు.
తండ్రి మాట ప్రకారం శివదీక్ష స్వీకరించి,
ఆత్మార్పణ గావించి శివారాధన తత్పరుడు అవుతాడు.కొంతకాలానికి శివుడు నందీశ్వరుని శివ దీక్షకు మెచ్చి నీకేం వరం కావాలి అని అడుగుతాడు.దానికి నందీశ్వరుడు నాకు ఆయుస్సు పెంచు అని అడగలేదు.
ఎందుకంటే శివ దీక్ష వహించిన వారి మేధా శక్తి అమోఘంగా పెరిగిపోతుంది.
ఎంతో తెలివిగా నందీశ్వరుడు...
నేను ఎల్లప్పుడూ నిను చూస్తూ,నిను సేవిస్తూ ఉండాలి అనే వరం కోరాడు.
నందీశ్వరుడు శివుని ఎదుట ఉండాలి
అంటే జీవించి ఉండాలి కదా!!
ఎంతకాలం జీవించి ఉండాలి!?
శివుడు ఉన్నంతకాలం...
అంటే శివ దీక్ష ఫలం వల్ల నందీశ్వరుడు
చిరంజీవి అయ్యాడు.
చూశారా... శివదీక్ష ఎంతటి మహాఫలాన్ని ఇస్తుందో.చిరంజీవిగా ఉండటం గొప్పకాదు. నిరంతరం ఈశ్వర సేవ చేసుకునే భాగ్యం కూడా శివదీక్ష వల్లే లభించింది.ఆనాటి నుంచి ఈ శివదీక్ష అనేది శివభక్తులలో అనుష్టాన సంప్రదాయంగా పురాణ ప్రసిద్ధిగా వస్తుంది.🌹🌹
#ఓంనమఃశివాయ🙏🌺🚩