కాశీ పట్టణంలో మణికర్ణీకా ఘాట్

P Madhav Kumar


ప్రస్తుతం సోషల్ మీడియా వలన... చాగంటి వారి ప్రవచనాల వలన... ఎన్నో మంచి మంచి విషేషాలు తెలుస్తున్నాయి... అలా తెలిసిన విషయమే... కాశీ పట్టణంలో మణికర్ణీకా ఘాట్ లో 12 గంటలకు చేసే దేవతా స్నానం... 

అందుకే మన తెలుగువారు అక్కడ పుణ్యస్నానాలు చేయడానికి వెళ్తున్నారు... చాలా మంది youtube followers అయితే ఖచ్చితంగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కూడా.. అయితే నూటికి 90 మంది మణికర్ణీక ఘాట్లో స్నానం చేస్తున్నారు కానీ మణికర్ణిక కుండంలో స్నానం చేయట్లేదు.... ఎందుకంటే ఇక్కడ సరిఅయిన guidence ఉండదు... వాస్తవంగా... మణికర్ణిక ఘాట్ వేరే మణికర్ణిక కుండము వేరే...



కాశీ నగరంలో ఉన్న 56 ఘాట్లలో మణికర్ణిక ఘాటు ఒక ప్రధానమైన ఘాట్...


ఈ ఘాటు కాశీలోని అన్ని ఘాట్లకు మధ్య లో ఉంటుంది... ఈ ఘాట్ కథ చూద్దాం... శివుడు తన పార్వతిని ఒంటరిగా వదిలి తన భక్తులు సందర్శించడం కోసం మాత్రమే తన మొత్తం సమయంను వెచ్చిస్తున్నారట. అందుకై పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి దేవి ఆలోచన అట. చాలా రోజులు ప్రయత్నించిన అనంతరం ఈ ప్రాంతంలో దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. ఆ అత్మ చెప్పిన ప్రకారం ఈ ప్రాంతంలో త్రవ్వడం వలన ఏర్పడిన కుండమే... ఈ మణికర్ణీకా కుండం అని పురాణ కథ... ఆ ఘాటే ఇది...



కాశీ నగరమే ఒక మహాస్మశానం అనుకుంటే... కాశీ నగరంలో మణికర్ణిక ఘాటులో ఉన్న స్మశానమే అన్నిటికన్నా పెద్దది... ఘాటుకు పోయే దారిలోనే ఎన్నో శవాలు ఎదురవుతూనే ఉంటాయి ... శవదహనం కోసం శవాలు క్యూలో ఉంటాయి...కంటిన్యూస్గా శవదహనమ్ జరుగుతూనే ఉంటుంది...అనేక మంది సందర్శకులు అంత్యక్రియలను శ్రాద్ధ కర్మలను బహిరంగముగా నిర్వహిస్తూ ఉంటారు.... మనం ఎక్కడ చూసినా ఘాట్ మొత్తం వారితోటే నిండిపోవడం గమనిస్తాం... ఇది పూర్తిగా వేరే ప్రపంచం... కాశీ నగరంలో ఉన్నంతవరకు మనం పొందే ట్రాన్స్మిషన్ పూర్తిగా డిఫరెంట్... అదొక రకమైన నిర్లిప్త వేదాంత భావం మనలో మెలుగుతుంది అందుకే జీవితంలో చాలా భాగం పూర్తి అయిన వారు మాత్రమే కాశి నగరానికి వెళ్లాలి అని పూర్వకాలంలో చెప్పేవారు...


ఇక్కడ కనిపించేదే మణికర్ణిక కుండము... 



ఈశ్వర అనుగ్రహం కోసం ఎంతోమంది దేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని నమ్మకం ఆ సమయంలో ఏదో ఒక దేవత కంట అయినా మనం పడితే చాలు...మన జీవితం మారిపోతుంది అట... అందుకోసమే కాశీకి వెళ్లిన వారు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ స్నానం ఆచరించడం మిస్ కావద్దు... అయితే నూటికి 90 మంది ఇప్పుడు చూపిస్తున్న ప్రదేశంలో స్నానని ఆచరిస్తారు.. ఎందుకంటే ఇది మణికర్ణీకా ఘాట్... కానీ వాస్తవంగా స్నానాన్ని ఆచరించవలసిన ప్రదేశం ఇది... మేము మంచి వర్షాకాలం కాశీ నగరాన్ని సందర్శించుకోవడం వలన పూర్తిగా ఘాట్లన్నీ మునిగిపోయి ఇప్పుడున్న పరిస్థితి లాగా ఉంది... ఈ మణికర్ణికా కుండామ్ పూర్తిగా మునిగిపోయి ఉంది.. చాలా జాగ్రత్తగా చివరి మెట్టు ఉన్న ప్రదేశంలో స్నానం చేసాము...


 Best Time to visit Kashi

అదే దీపావళి సమయంలో కానీ మాఘమాసంలో గాని కాశీ నగరాన్ని సందర్శిస్తే ఘట్లలో రద్దీ బాగా తగ్గి ఘాట్లు పూర్తిగా బయటకు వచ్చి చక్కగా కనబడతాయి కాశీ నగరాన్ని సందర్శించాలి అంటే జనవరి ఫిబ్రవరి నెలలో ఉత్తమం అని అనిపిస్తుంది...


To do list at Manikarnika Ghat

ఇక్కడ అయ్యగార్లు మొత్తం ఒక బ్యాచ్ లాగా ఉంటారు మనిషికి ఒక 50 రూపాయలు ఇస్తే మణికర్ణి కా కుండం మరియు మణికర్నికా ఘాట్లో సంకల్ప సహిత స్నానం చేయడానికి అవకాశం ఇస్తారు... విడిగా అక్కడికి వెళ్లిన వారికి ఇవన్నీ అర్థం కాదు కాబట్టి ఒక 50 రూపాయలు పోయినా గాని అయ్యగారిని కలిసి ఆయన ద్వారా సంకల్ప స్నానం చేయించుకుంటే మనకి తగిన ఫలం దక్కుతుంది...

 

కాశీ నగరంలో ఎన్నో విడి ఆలయాలు ఉంటాయి. అలాగనే ఈ కాశీలో ఈ ఇలా వాలుగా ఉన్న ఒక దేవాలయం అక్కడ కనబడుతుంది మణికర్ణిక ఘాట్లో మాత్రమే ఉంటుంది లినింగ్ టవర్ ఆఫ్ పీసాను ఎంతో గొప్పగా చెప్పేవారు ఇంతవాలుగా ఉన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని వేల సంవత్సరాల నుండి ఈ మందిరం ఇక్కడ ఉండటం కంటికి ఆనందాన్ని మనకి ఇస్తుంది... చూడవలసిన ప్రదేశాల్లో ఈ ప్రదేశం కూడా ఒకటి.. వాస్తవంగా ఈ చిత్రంలో ఉన్నట్లుగా ఉంటుంది కానీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడం వలన శిఖరం మాత్రమే ఈ వీడియోలో మీకు కనబడుతుంది...


మణికర్ణిక ఘాట్లో మణికర్నికే శ్వర ఆలయం కూడా ఉంటుంది దీనికోసం మనం పూర్తిగా పైకి ఎక్కి 51 మెట్లు దిగి స్వామిని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది... ఒకసారి స్వామిని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు అని నమ్మకం... మణికర్ణిక ఘాటుకి వెళ్లినవారు ఇది మిస్ కావద్దు...




Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat