ధనదాదేవి స్తోత్రం,ఈ స్తోత్రాన్ని పఠిస్తే సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది.

P Madhav Kumar

 


ఈ స్తోత్రాన్ని పఠిస్తే సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును. రాక్షసాది గ్రహాలు భాదించవు. ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను. దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది.


నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే l

మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతేll


మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే

సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి l

దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే l

శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే ll


విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణిl

మహాసత్వ గుణే నంతే ధనదాయే నమోస్తుతేll




శివరూపే శోవానందే కారణానంద విగ్రహేl

విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతేll


పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే

సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే l

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat