ఐదు యజ్ఞాలు చేయని వాడు *గృహస్థు* పదానికి అర్హుడు కాడు

P Madhav Kumar
.

1. ఇంట్లో కుల దేవతలని , వంశ దేవతలని, ఇష్ట దేవతలని ఆరాధించాలి. నిత్య దేవతారాధన జరగాలి. ఇది మొదట చేయ వలసినది . 

2. పితృ దేవతలని ఆరాధించడం. పూర్వ కాలంలో తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పటికీ నిత్య పితృ తర్పణం ఉండేది. అంటే, క్రితం జన్మలో తండ్రికి కూడా పితృతర్పణం చెయ్యాలి.

3. ఋషి యజ్ఞం జరగాలి. అంటే, మహర్షులు రచించిన గ్రంధాలను ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి . అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.

4. మనుష్య యజ్ఞం - ఆ ఇంటిలో అతిధి అభ్యాగతులు వస్తూ , భోజనం చేస్తూ వారికి కావలసినవి తృప్తి పరచడం జరగాలి. 

5. తన ఇంటి మీద ఆధార పడిన ప్రాణి కోట్లని కాపాడడం . చెట్లు చేమలని పెంచడం , పశు పక్షాదులని పోషించడం.

ఈ ఐదూ ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది.

*ఇల్లు అంటే సుఖ పడటానికి షెల్టర్ కాదు. ధర్మం చేయడానికి స్థానం.*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat