🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది?*
➖➖➖✍️
*కృతయుగం నుండి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది.*
*కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి.*
*కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం.*
*పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు…*
*1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.*
*2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది.*
*3. వివాహ వ్యవస్థ నిలబడదు.*
*4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు.*
*5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు.*
*6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర ములకే పడిపోతుంది.*
*7. స్త్రీలు కేశపాశములు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది.*
*8. పురుషులు 18 సంవత్సరములకే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో "శంభాలా" అనేటువంటి గ్రామంలో ‘విష్ణుయశుడు’ అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు.*
*9. అది ఎప్పుడు అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది.*
*10. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలి పోతారు.*
*11. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి.*
*12. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు.*
*13. ఆయన "శ్వేతాశ్వాన్ని " ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు.*
*14. తరువాత కలియుగం పూర్తి అవుతుంది ఆతరువాత ‘కృతయుగం’ ప్రారంభం అవ్వడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది.*
*15. ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం.*
*16. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించిన నమస్కరించిన పాపబుద్ధి పోతుంది.*
*17. అంత గొప్ప అవతారం కల్కి అవతారం.*✍️
*ఓం నమో నారాయణాయ నమః.*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀