☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
అక్కర్లేని విషయాలు ఏవీ వినవద్దు - అని మీ చెవులకు మీరే చెప్పండి
అన్నిపనులు తనకిష్టంగా మరల్చుకొనేవాడు తెలివైన వాడు.
ఆలోచించి చేసే ఏ పనికైనా విజయావకాశాలు ఎక్కువ.
మంచి పనులు చేసేటప్పుడు బిడియపడడం మంచిదికాదు.
*ఇచ్చింది మరిచిపోవడం , తీసికున్నది జ్ఞాపకముంచుకోవడం ఉత్తమ లక్షణం. పుచ్చుకొన్నది మరిచిపోవడం , ఇచ్చింది దలచి వాపోవడం అధమ లక్షణం.*
వివేకవంతులతో స్నేహం నిన్ను వివేకవంతునిగా చేస్తుంది.
బుద్ధిహీనులతో సహవాసం ఆపదను తెచ్చిపెట్టును.
సమస్య ఎంతటిదైనా సకాలంలో చర్య తీసుకుంటే అపజయం ఉండదు.
గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించడం విఫలం అవడం తప్పుకాదు. గొప్ప లక్ష్యం లేకపోవడమే తప్పు.
చిన్న చిన్న ప్రయత్నాలు చేయువారే పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించగలరు.
అందరూ మంచివారే అని గ్రుడ్డిగా నమ్మి మన పనులను అప్పగించరాదు.
అందరూ చెడ్డవారే అని మన పనులను ఎవ్వరితో పంచుకొనక యుండుటయు దోషమే.
కోర్కెలను మనం మేపుతాం - కోర్కెలు మనల్ని మేస్తాయి.
తినేందుకు జీవించువాడు బద్దుడు , జీవించుట కొరకు తినువాడు ముగ్ధుడు.
వ్యక్తిగతంగా మన ప్రవర్తన చక్కబడితే సమాజము చక్కబడుతుంది.
నీరు ఉంటే నారు మొలుస్తుంది. నీతి ఉంటే జాతి నిలుస్తుంది.
ఒక శ్రేష్టమైన జాతిని నిర్మించేందుకు మార్గం - శ్రేష్టమైన వ్యక్తులను తయారు చేయడమే.
ఈగలు పుండును ఆశించును. రాజులు ధనమును ఆశింతురు. నీచులు కలహభోజులు. సత్పురుషులు , సాధుపుంగవులు శాంతిని ఆశింతురు.
ఆడదంటే అబల అనేనానుడి చెరిపి వేసి , మహిళలంటే మహబలులు అని నిరూపించాలి.
పుస్తకమును చదువుటతో బాటు మస్తకమును కూడా చదువ వలెను.
విద్యను ఆర్జించుటతో బాటు అవిద్యను విసర్జించవలెను.
ప్రపంచంలో శాంతి పావురాలు ఎగుర వేయడంకాదు. ఇంటిలోని పోరును మాన్పించటం, నేర్చుకోండి.
దండించ వలసినచో దండించక తప్పదు. వదలిపెడితే సంఘానికే ముప్పు.
పోలీసు శాఖ ఎక్కడ బాగుంటుందో , అక్కడ సమాజం బాగుంటుంది.
సమాజానికి పోలీసింగ్ ఉండాలి. కాని పోలీసు కనబడకూడదు.