ఈశ్వర దండకం

P Madhav Kumar
శ్రీ కంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ మురారీ! ప్రియ చంద్రధారీ ! మహేంద్రాది బృందారకానంద సందోహ

సంధాయి పుణ్య స్వరూపా! విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసకా ! దేవ నీదైన తత్వంబు భావించి బుద్ధిం బ్రధానంబు కర్మంబు!

విజ్ఞాన ఆధ్యాత్మ యోగంబు ! సర్వ క్రియా కారణంబంచు నానా ప్రకారంబులం

బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను

భావింతు దేశాన సర్వేశ్వరా ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా! నిర్వికల్ప ప్రభావా! భవానీ పతీ నీవు లోక త్రయీ వర్తనంబుల్

మహీవాయుఖాత్వగ్ని సోమార్క తోయంబు లం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై ఆది దేవా! మహాదేవ

నిత్యంబు నత్యంత యోగస్థితి న్నిర్మల జ్ఞాన దీప ప్రభా జాల విధ్వస్త నిస్సార

సంసార మాయాంధకారుల్ జితక్రోధరోగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ !

భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదాతృప్తులైరి అవ్యయా!

భవ్య సేవ్యా! భవా భర్గ భట్టారకా ! భార్గవాగస్థ్య కుత్సాది నానా

ముని స్తోత్ర దత్తవధానా ! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ ! భస్మానులిప్తాంగ! గంగాధరా ! నీ ప్రసాదంబునన్ సర్వ గీర్వాణ గంధర్వులున్!

సిద్ధసాధ్యారగేంద్రామరేంద్రాదులున్!

శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా !! సురాభ్యర్చితా !! నాకున్ అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ !! త్రిలోకైకనాథా!

మహా దేవ దేవా !! నమస్తే నమస్తే నమస్తే నమః ||

మహా భారత అరణ్య పర్వంలో

అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రములు పొంది ఈ దండకంతో శివుని స్తుతించాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat