నడిపించేది నామస్మరణమే....

P Madhav Kumar

 వెలుగురేఖ చీకట్లను చీల్చినట్లు.. నారాయణ.. శ్రీమాత లాంటి ఒక్కో నామోచ్చరణ ఒక్కో ఫలితాన్నిస్తుంది. అన్నిటి ప్రయోజనమూ ఇహపర కామ్య సిద్ధ్యర్థమే. ఒక్కో గమ్యానికి వివిధ గమనాలూ, మార్గాలూ ఉన్నట్లు ఉపాసన సగుణమైనా నిర్గుణమైనా నామస్మరణ రెండింటా ఉంటుంది. ఎలాగైతే తల్లిదండ్రులు దూరంగా ఉన్నా వారిని తలచుకుంటామో ఇదీ అంతే. చిత్తశుద్ధితో చేసే స్మరణ ఇలలో సాయపడటమే కాక, ఆ పైన కూడా ఒక్కో మెట్టూ ఎక్కడానికి దోహదపడుతుంది. అయితే లౌకిక విషయాల్లో కొట్టుకుపోతున్న మనం ఇదంతా భ్రాంతి అని గ్రహించలేకపోవటం కూడా మాయే. అజ్ఞానమూ మాయే కనుక అందుకు చింతించనవసరం లేదు. మన చేసే ప్రతి పనీ భగవంతుడి బొమ్మలాటలో భాగమేననీ, పొందే ప్రతి ఫలమూ భగవదర్పితమనీ, తుట్టతుదకు మనం లీనమయ్యేది ఆ పరమాత్ముడిలోనే అనీ- మననం చేసుకుంటూ జగన్మాతా పితరులను స్మరిస్తుండాలి. అప్పుడు మన చుట్టూ అదృశ్యంగా వ్యాపించి ఉన్న సౌరభ ఆవృద్ధీణం పరిమళించి మనల్ని తేలిగ్గా ముందుకు నడిపిస్తుంది.

..


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat