క్షీర సాగర మథనం నుండి పుట్టినవి ఏమిటి?

P Madhav Kumar

క్షీర సాగర మథనం నుండి పుట్టినవి ఏమిటి? వాటి విశేషాలు ?


హాలాహలం – గరళం (విషంతో కూడినది) శివుడు స్వీకరించాడు.

సురభి కామధేనువు – తెల్లని ఆవు – దేవమునులు తీసుకున్నారు

ఉచ్ఛైశ్రవము – ఎత్తైన తెల్లని గుఱ్ఱము – బలి చక్రవర్తి తీసుకున్నాడు.

ఐరావతము – నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు – ఇంద్రుడు తీసుకున్నాడు.

కల్పవృక్షం – కోరికలు తీర్చే చెట్టు – ఇంద్రుడు తీసుకున్నాడు.

అప్సరసలు – దేవతా సుందరీమణులు – ఇంద్రుడు తీసుకున్నాడు.

సుధాకరుడు – చంద్రుడు – ఆకాశంలో ఆకాశంలో వర్తిస్తున్నాడు.


లక్ష్మీ దేవి – సకల సంపదల దేవత – విష్ణువును వరించి వక్షస్థలమున ఉంది.

వారుణి – మధ్యమునకు అధిదేవత – రాక్షసులు పుచ్చుకున్నారు

ధన్వంతరి – వైద్యానికి అధిదేవత – దేవతలలో చేరాడు.

అమృతం – మరణంలేని మందు – దేవతలు తీసుకున్నారు.


సాగరమథనంలో అవతారాలు: కూర్మావతారం, మోహినీ అవతారం.

సాగరమథనంలో పాలుపంచుకున్న అష్టకం (8): క్షీర సాగరం, శ్రీమహావిష్ణువు, దేవతలు, దానవులు, గరుత్మంతుడు, మందర పర్వతం, వాసుకి నాగేంద్రుడు, పరమశివుడు


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat