శ్రీ అయ్యప్ప చాలీసా

P Madhav Kumar

 శ్రీ అయ్యప్ప చాలీసా


(గురుస్తుతి)


శ్రీ గురుమూర్తికే జ్ఞానము నొసగిన | శ్రీ గురుస్వామి అయ్యప్పదేవర ॥ హరిహరపుత్రా శరణం మయ్యప్పా | సతతము వేడెద నన్నిల కావర ॥ పదునెనిమిది మెట్టెక్కి పదములుకీలుచు | నీపద సన్నిధి నీయగ వేడెద || ॥ స్వామి శరణం బనుదివ్య నామం | సద్గతి నొసగగ సర్వదా వేడెద ॥

చాలీసా

జయశబరీశా జ్ఞాన ప్రదాత | జయము జయము ప్రభు హరిహర పుత్రా॥ ధరలో మహిషి పెట్టెడు బాధలు | నొర్వక వేడగ హరిహర దేవుల ॥ దివ్యుల కోర్కెలు తీర్చగ తలచిరి | మహిషిని కూల్చగ యోచన చేసిరి ॥ చండిక మహిషిని చంపినదనుచు | మొండిగ వచ్చెను కోపము మహిషికి ॥ బ్రహ్మను గూర్చి తపమును చేసెను । దివ్యవరములు మహిషి బడిసెను ॥ వరబల గర్వము మహిషిక్రోధము | ఇంద్రుని పదవికి ఎసరు బెట్టెను || పాపము వేల్పుల బ్రహ్మ, శంకర | విష్ణుమూర్తులను వినతి చేయగా ॥ అంతకు మునుపే మోహినియైన | మోహన రూపము దాల్చెను విష్ణువు ॥ అమృత మొసగి భస్మాసురునీ కూల్చిన మోహిని శక్తికి మురిసి ॥ పరమశివుడు పురుషుడాయెను । మోహన మోహిని కౌగిలి పొందెను ॥ అద్భుత శిశువు ఉద్భవించెను | హరిహరపుత్రుండాతడాయెను ॥ మహిషికి మరణము సిద్దమాయెను | జగతికి శుభము కలుగబోయెను॥ సంత్రుప్తి చెందె రాజశేఖరుడు | వేటసల్పుచూ విసియె వింతగా ॥ అచ్చెరువొందెను అవనిసీమల | ముచ్చట గొలిపెడు బాలుని గాంచి ॥ముద్దులొలికెడు బాలుని చూసి | దైవలీలగా భావనచేసి ॥ బాలుని చేకొని వెడలెడు వేళ | రాజా ! బిడ్డను పన్నెండేళ్ళు ॥ నాకుము నీకు శుభములు కల్గు | మనోవాంఛలను సిద్ధించు నీకు ॥ యను వాణిని వినగానే బాలుని | వడివడిగా సాగెను రాజ్యమును ॥ మణినికంఠమున కలిగెను గాన మణికంఠునిగా పేరును పెట్టిరి ॥ వంతులేని తమ చింతలు వీడి | పెంచిరి అల్లారుముద్దుగా బాలుని ॥ విద్యాబుద్ధులు నేర్పగ తలచి పంపిరి బాలుని గురుకులమునకు ॥ గురుశుశ్రూషన సర్వవిద్యలు | అచిరకాలమున నేర్చిన శిష్యుని ॥ అత్యాశ్చర్యము నొందీ చూచెను | అతని అద్భుతశక్తికి మురిసెను || గురుదక్షిణగా మూగబాలునికి | మాటనీయమని కారణజన్ముని ॥ కరుణ వేడగా శ్రీ గురుదేవులు ॥ శరణునొసగెను మాటవచ్చునని ॥ తనది ఉనికిని ప్రస్తుతమెవరికి | చాటవలదనే హరిహరపుత్రుడు ॥ మణికంఠుని పాదమహత్యమున రాణి కనియెను మరియొక శిశువును || హరిహరపుత్రుని అంతముచేసేడు | దుష్టయోచనల మంత్రి సూచనలు॥ సర్వం విఫలంకాగా చివరకు | పులిపాలు కోరుచు పంపిరి అడవికి ॥ మహిషి చేసేడు ఘోరకార్యములు | తెలిసినవాడై కూల్చగ తలచి ॥ కరములతో మహిషి కంఠము నొక్కి। ధరపై విసర భీకర కాయము ॥ అమరులందరు హర్షధ్వనులు | అభినందించిన హరిహరపుత్రుని ॥ తనదు కోరిక తెలిపి ఇంద్రునకు । ఆడబెబ్బులిని ఇంద్రుని చేసి II ఇతర వేల్పులు పులులై నడువ అడుగిడె తండ్రి రాజ్యమునందు ॥ కోరిన పాలు చేకొను రండు | ఆవల పంపెద ఈ పులిదండు| అయ్యప్పశక్తికి అబ్బురపడుచు । సాధారణుడు కాడని తలుచుచు || అజ్ఞానమును బాపగ వేడిరి | తమదు తప్పులు కావగ కోరిరి ॥ తండ్రీ పుత్రుడు ప్రేమ జూడుము ॥ ఈ శూలము పడ్డచోట ఆలయము ॥ నిర్మించి నన్ను చేర చూడుము | అవతార లక్ష్యమిదియని పల్కెను ॥ హరిహరపుత్రుని ఆనతి మేరకు శబరిమలను వాసము చేసెను ॥ శిరమున కొబ్బరి ఫలమును దాల్చి ఇరుముడిగా ప్రభుపాద సన్నిధిని ॥ చేయనియెడ హరిహరపుత్రా | శరణం చరణం స్వామి అయ్యప్పా |హరిహరపుత్రుడు అయ్యప్ప చాలీసా | హరిహర కృపన శ్రీ గురుశక్తిన|| రామక్రిష్ణుడే ధరలో వ్రాసెను । కరుణ వేడుచు ధర్మశాస్తాను ॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat