ధర్మశాస్త్ర అష్టకం

P Madhav Kumar

 

'1. గిరిచరం కరుణామృత సాగరం పరిచరం పరమం మృగయా పరమం సురుచిరం సచరాచర గోచరం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్


శబరిమల పైన సంచరించే వాడు, కరుణా సాగరుడు, వేట తమకం కలవాడు, సుందరుడు, సాక్షీ భూతుడు, హరిహరుల పుత్రుడు, అయిన అయ్యప్ప స్వామిని ఆశ్రయించాలి.


2.ప్రణత సంజయ చింతిత కల్పకం ప్రణుత మాదిగురుం సుర శిల్పకం ప్రణవ రంజిత మంజుల తల్పకం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్


భక్తుల కోరికలను తీర్చుటకు కల్పవృక్షం అయిన వాడు, ఆదిగురువు, ప్రణవ రంజితుడు, సుందర తల్పం కలవాడు, హరిహరుల పుత్రుడు, అయిన అయ్యప్ప స్వామిని ఆశ్రయించాలి.


3.అరి సరోరుహ శంఖ గదాధరం పరిఘ ముద్గర బాణ ధనుర్ధరం ఛురిక తోమర శక్తి లసత్కరం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్


చక్రం, పద్మం, శంఖం, గద, పరిఘ, ముద్గరం, ధనుస్సు, బాణాలు, ఛురిక, తోమరం, శక్తి ఆయుధాలు ధరించిన వాడు, హరిహరుల పుత్రుడు అయిన అయ్యప్పస్వామిని ఆశ్రయించాలి.


4. విమల మానస సార భాస్కరం విపుల వేత్ర ధరం ప్రియశంకరం విమత దండన చండ ధనుష్కరం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్


భక్తుల హృదయ కమలాలకు సూర్యుడు, వేత్రధరుడు, సుఖప్రదుడు శత్రువులను పారద్రోలుటకు ధనుస్సును ధరించిన వాడు,హరిహరుల పుత్రుడు అయిన అయ్యప్పస్వామిని ఆశ్రయించాలి.


5. సకల జీవ నమస్కృత పాదుకం సకృదుపాసక సజ్జన మోదకం సుకృత భక్త జనావన దీక్షకం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్


సమస్త జనుల నమస్సులు అందుకున్న పాదుకలు గలవాడు, ఉపాసకులకు ఆనందాన్ని కలుగజేసే వాడు, పుణ్యాత్ములను, భక్త జనులను రక్షించటానికి దీక్ష పట్టిన వాడు, హరిహరుల పుత్రుడు, అయిన అయ్యప్పస్వామిని ఆశ్రయించాలి


6. శరణ కీర్తన భక్త పరాయణం చరణ వారిజ మాత్మ రసాయనం వర కరాత్త విభూతి విభూషణం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్


భక్త పరాయణుడు,ఆత్మానందాన్ని కలుగ చేసేవాడు, వరదహస్తం కలవాడు, విభూతి భూషణాన్ని ధరించిన వాడు, హరిహరపుత్రుడు, అయిన అయ్యప్పస్వామిని ఆశ్రయించాలి.


 7.మృగ మదాంకిత శక్తి లకోజ్వలం మృగ గణా కలితం మృగయాకులం మృగ వరాసన మద్భుత దర్శనం హరిహరాత్మజ మిశ్వర మాశ్రయేత్ 


కస్తూరి తిలకం చేత ఉజ్జ్వలంగా ఉన్న వాడు, వేట యందు వ్యాసక్తుడు, వ్యాఘ్రాజినం పై ఆసీనుడు, చుట్టూ మృగాలు ఉన్న వాడు, హరిహరుల పుత్రుడు, అయిన అయ్యప్పస్వామిని ఆశ్రయించాలి.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat