🌼🌿రాహుకాల పూజ..!!🌼🌿 / Raahukaala Pooja

P Madhav Kumar


రాహుకాలం అనగానే, ఆ సమయంలో ఎదైన పని మీద బయలుదేరటంగాని, కొత్తగా..ఏదైనా ..పనిని మొదలు పెట్టడం గాని చెయ్యొద్దు అని మన ఇళ్ళలో అంటూ ఉంటారు. కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. 


రాహువు..మంత్రాలకు..అధిదేవత. రాహువుకు దుర్గాదేవి..అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అందుకే గ్రహణ సమయంలో..మంత్రం తీసుకున్నవాళ్ళు మంత్రజపం చేసుకుంటారు.


ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. 


ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, ఏదైనా శ్రీదుర్గా స్తోత్రం...చదివి నైవేద్యం పెట్టాలి. 


రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. 


కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడ్తారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది.. లేదూ ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో..బయట తులసి కోట దగ్గర పెట్టాలి..ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు..ఒకరే వెలిగించాలి..


రాహుకాల సమయం :..

సోమవారం - ఉ 7:30 -9:00

మంగళవారం - మ 3:00 -4:30

బుధవారం - మ 12.00 - 1:30

గురువారం - మ 1:30 - 3:00

శుక్రవారం - ఉ 10:30 - 12:00

శనివారం - ఉ 9:00 - 10:30

ఆదివారం - సా 4:30 - 6:00 


సూర్యోదయం..రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది..దాన్నిబట్టి రాహుకాల టైమ్ మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి...ముందు ఒక అరగంట..వెనుక ఒక అరగంట టైం వదిలి మధ్యకాలం తీసుకోండి.అంటే ఉదాహరణకు.. సోమవారం ..ఉ 7.30 to 9.00 అంటే 8 to 8.30 ఇలా చూసుకోండి.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat