యంత్రము అంటే ఏమిటి, ఎందుకు పూజించాలి? - Meaning of yantra

P Madhav Kumar

 యంత్రమును ఎందుకు పూజించాలి?


యం యంత్రమును ఎందుకు పూజించాలి? త్రం అనేది ఎవరైనా ఒక దేవతామూర్తి యొక్క బీజాక్షరాల సమూహముతో జ్యోతిష్య మరియు తాంత్రిక శాస్త్రాల రీత్యా ఉన్న మంత్రములతో ఆ ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములో సర్వ శక్తులను, అష్ట దిగ్పాలకులను ఆవాహనం చేసే ఒక దివ్యమైన చక్రం. యంత్రములో ఉన్నటువంటి బీజాక్షరాల ప్రభావం వలన నెగెటివ్ ఎనేర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనేర్జీ పెరుగుతుంది.

 ఎక్కడైతే యంత్ర స్థాపన జరుగుతుందో అక్కడి నుండి నెగెటివ్ ఎనేర్జీ దూరమయ్యి పాజిటివ్ ఎనేర్జే వచ్చి చేరుతుంది. ఈ యంత్ర సాధనా ప్రభావం మన మనస్సుపై పడుతుంది. మానవుని శరీరమును నిత్యం ప్రభావితం చేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు పై మానవుని సకల ఆరోగ్యము కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా దేవాలయమునకు వెళ్ళినపుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవాలయము నుండి అడుగు బయట పెట్టగానే ఏదో మాయ కమ్మినట్టు మన మనస్సు యధా విధిగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే దేవాలయములో ప్రతిష్ట చేసిన విగ్రహాల క్రింద వివిధ వేద మంత్రములతో, బీజాక్షరములతో ఒక యంత్రమునకు జీవం పోసి ప్రతిష్ట చేసి ఉంచుతారు. ఆ యంత్ర ప్రభావము వల్లనే ఆ ప్రాంతం మొత్తం పాజిటివ్ శక్తిగా ఉంటుంది. ఆ పాజిటివ్ శక్తి మన మనస్సు పై పడి మన మనస్సును ఉత్తేజపరుస్తుంది. ఏ సమస్య గురించి మనకు బాధలు కలుగుతున్నాయో అలాంటి ప్రతి సమస్యకు ఒక నిర్ధిష్టమైన యంత్రమును తెలుపటం శాస్త్రమును అవపోసన పట్టిన ఒక్క జ్యోతిష్యునికే ఇది సాధ్యపడుతుంది. ఆ నిర్ధిష్టమైన యంత్రమును ప్రత్యేక బీజాక్షరాలతో, నిర్ధిష్టమైన రోజుల కాలము పాటు శ్రద్ధగా పూజించినట్లైతే సమస్య నుండి విశ్రాంతి లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే యంత్రం అనేది భగవంతునికి ప్రతిబింబం లాంటిది.యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు

యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనమునిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. కొందరు తాంత్రికము అనగానే అది ఏదో చెడు కలిగించే ప్రక్రియ అని అంటారు. కానీ ఇది ఎంత మాత్రము నిజము కాదు. ఇతరులకు చెడు కలిగించే ప్రక్రియను ‘కుతంత్రము’ అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు. యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత్రములు వాటికి సంబంధించిన బీజమంత్రములతో ధ్యానము గావించి , నిర్ధిష్టమైన రోజుల పాటు, నిర్ధిష్టమైన సంఖ్య సార్లు జపించి సిద్ధి పొంది ఆ యంత్రము నుండి పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat