🔱 శబరిమల వనయాత్ర - 1 ⚜️ కోట్టప్పడి ⚜️

P Madhav Kumar


పేటలో ఎగిరిన పిదప ఆలయమునకు ముందు ప్రక్కన ఉత్తర దక్షిణములుగా ప్రవహించు కాలువ యందు స్నానము చేసి ఆలయములో ప్రవేశించి దర్శనము చేసియే తాము తావళము ఏర్పర్చుకొన్న “విరి" యందు (ఇరుముడులను ఉంచిన స్థలము)

ప్రవేశించవలెను. ఇది అచ్చటి ఆచారము. ఆ దినము అచ్చటనే క్షేత్రోపవాసము చేసి ,మరుసటి దినము ఉషఃకాలము నందు భగవంతునికి కానుకలొసంగి నమస్కరించి , అరణ్య యాత్రకు అనుమతిని వేడి కొబ్బరికాయ ఒకటి కొట్టి ఇరుముడి కట్టును మోసికొని అచ్చటినుండి బయలుదేరి ఎరుమేలి , పేటలో శాస్తాకు నమస్కరించి వీడ్కోలు పుచ్చుకొని , శరణుఘోషలు పలుకుతూ వనయాత్ర మొదలిడెదరు.


*కోట్టప్పడి*


*“ఎరుమేలి పెట్టకొండు పేట్టయాడి - కోటప్పడి ఆస్థానవుం కడన్ను”* యని అయ్యప్ప

స్వామి యొక్క పళ్ళినాయాటు పాటల యందు కనబడుచున్నది. అట్టి చరిత్ర ప్రఖ్యాతి

గాంచిన కోట్లైపడి యను స్థలము నేడు అంతటి ముఖ్య ఘట్టముగా ఎంచబడుట లేదు. ఎరుమేలి పెట్టకళమునుండి తూర్పుదిశగా కొంతదూరము వెడలినచో పైసూచించపబడిన ఈ స్థలము గలదు. అయినను భక్తుల రాకపోకలు ఎక్కువగా

యుండుటచే కోట్టైపడి యనబడు ఈ స్థలమును దాటి చాలా దూరము వరకు ప్రజలు నివాస స్థలము ఏర్పరచుకొని నివసించుటచే వనయాత్రలో యొక ముఖ్య ఘట్టముగా ఎంచబడు ఈ స్థలము యొక్క అవశిష్టములు మాత్రమే కనిపించు చున్నది. ఎరిమేలి నుండి పేరూర్ తోడు అను స్థలమునకు రెండుమైళ్ళ దూరము కలదు. దానికి పైన యున్న స్థలమును అయ్యప్ప భక్తులు స్వామి వారి యొక్క కోటప్పడి అని సంబోధింతురు. ఇచ్చట కూడా శరణాలు పలుకుతునే యుందురు. ఈ కోటప్పడి దాటిన

పిదపే పేరూరోడు చేరుట.


కోటప్పడి నుండియే స్వామివారి యొక్క నందనవనము ప్రారంభించబడుచున్నదని

అనేకమంది పళమస్వాములు చెప్పుదురు. పూంగా వనమున కున్న మార్గము అదే అయినందువలన దానిని కోటప్పడి అనియూ ఘోష్టస్థానమనియూ , కోట ముఖద్వారము అనియూ చెప్పబడు చున్నదేమో అనునది నిర్ధారణ గాకున్ననూ

పళమస్వాములు చెప్పుచున్న పద్ధతినే అనుచరులు గూడా స్వీకరించి *'స్వామి వారి కోట్టప్పడియే శరణం అయ్యప్ప'* అని శరణాలు పలుకుతూ ఆ స్థలము దాటి పేరూరు తోడు చేరుకొందురు.


ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat