పూర్వకాలంలో ఒక రాజు అరణ్యంలో వేటకు బయలు దేరును అలసిపోయిన రాజు ఆ అడవిలోని జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు
ఆకలితో ఉన్న రాజుకు అతని పరివారానికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం ఏర్పాటు చేసి రాజు పరివారం ఆకలి తీర్చేను అంతమందికి ఒక మహర్షి విందు ఏర్పాటు చేయడం అర్థం కాక జమదగ్ని దగ్గరకు వెళ్లి సందేహం అడిగినాడు అప్పుడు మా ఆశ్రమంలో కోరిన కోరికలు తీర్చే కామధేనువు ఉన్నదని ఏ అవసరమైన ఈ గోవు ప్రసాదిస్తుందని తెలియజేశారు అంతట రాజు సన్యాసుల వద్ద ఉండడం కన్నా దేశాన్ని పాలించే రాజు వద్ద ఆ గోవు ఉండటం ఉపయోగమని గోవును రాజ్యానికి మని అడగను కానీ జమదగ్ని నన్ను క్షమించండి మహారాజా మీ కోరిక మన్నించి లేను ఈ గోవే మాకు అక్షయ పాత్ర మీకు ఇవ్వడం కుదరదని తెలిపెను కోపానికి గురైన రాజు చక్రవర్తి అయిన నేనే అడిగినా కాదంటావామీ అనుమతి అవసరం లేదని ఆ గోవును రాజ్యానికి తీసుకపోయి జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని ఆ రాజు అతని సైన్యం తో యుద్ధము చేసి రాజు శిరస్సును ఖండించిన గోవుని తీసుకుని ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు జరిగినదంతా జమదగ్ని మహర్షి కి తెలియజేయగా పరశురాముని మందలించి పాప పరిహారార్ధం కాశీకి వెళ్లి గంగానదిలో పుణ్య స్నానమాచరించి రావలసిందిగా ఆదేశించారు
పరశురాముడు కాశీలో ఉన్న సమయంలో ఆ రాజు కుమారులు జమదగ్ని ఆశ్రమానికి చేరి ఆశ్రమంలో ఉన్న జమదగ్ని మహర్షిని అతని శిరస్సు ఖండించి తీసుక పోయినారు
కాశీ యాత్ర నుండి తిరిగి వచ్చిన పరుశరాముడు జరిగిన ఘోరం చూసి ఆవేశపరుడు ఐ అతని కుమారులను ఖండ ఖండాలుగా వధించెను అటు పిమ్మట పరశురాముని ఆగ్రహం తీరక క్షత్రియ వంశ సమస్తము ఈ భూమ్మీద లేకుండా చేయాలని వివిధ రాజ్యాల పై దండెత్తి క్షత్రియ రాజులందరినీ సంహరించి క్షత్రియ జాతిని నిర్వీర్యం చేసిన శ్యమంతక పంచకం అనే ఐదు నదులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తన తల్లిదండ్రులకు తర్పణం అర్పించెను ఆ తరువాత క్షత్రియ రాజులను చంపిన పాపపరిహారార్థం తాను సాధించిన భూభాగం మొత్తం దానము చేసెను ఆ తరువాత పరశురాముడు గోకర్ణం పోయి అచట తపస్సు చేయసాగింది పరశురాముడు తపస్సుకు మెచ్చి వరుణ దేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అనగా అప్పుడు పరుషరాముడు తనకు భూదానము చేయుటకు భూమి కావాలని కోరెను అందుకు సమ్మతించిన వరుణుడు పరశురాముడు తన గొడ్డలితో విసిరి కొట్ట వలసిందిగా ఆజ్ఞాపించెను ఆ పసుపు పడిన చోట సముద్రం నుండి భూమి ఉద్భవించెను అలా సముద్రం నుండి ఉద్భవించిన నేలనే పరశురామ క్షేత్రమైన కేరళ రాష్ట్రం విచిత్రమైన సంఘటన ఒక సారి పరిశీలించండి మన భారత దేశ పటం ని ఒకసారి చూడండి కేరళ భూ భాగము ఒక గండ్రగొడ్డలి వలె కనిపించును చూశారు కదా మలయాళీల దేశం ఎలా ఉద్భవించింది
పరుశరాములు తాను సృష్టించిన భూభాగంలో 108 శాస్త్ర దేవాలయాలు 108 భగవతి దేవాలయాలు 108 శివుని దేవాలయాలు 108 విష్ణు మూర్తి దేవాలయాలు 108 ఇతర దేవాలయాలు నిర్మించను
ఆ 108 శాస్తా దేవాలయాల్లో శబరిమల ధర్మశాస్త్ర దేవాలయం మొట్టమొదటిది ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి కేరళ లో ఏ దేవాలయం చాలా వైశాల్యంతో కొన్ని ఎకరాలలో ఉంటుంది ఇప్పటికీ పరుశరాములు ప్రతిష్ఠించిన 108 శాస్త్ర దేవాలయాలు సజీవంగానే ఉన్నవి ఆ దేవాలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలు కూడా జరుగుచున్నవి ఇంకో విషయం ఏమంటే పరుశరాముడు నిర్మించి దేవాలయాల్లో ఎంతో శక్తి ఉంది ముఖ్య విషయం పర్ష రాముడు నిర్మించిన ప్రతి ఒక్క దేవాలయము దాని పరిసర ప్రాంతాలు భారతదేశంలో ఉన్న పూజారులను పిలిచి ఆ బ్రాహ్మణులకు దానము ఇచ్చెను అందులో భాగంగా మనం నిత్యము ఆరాధిస్తున్నా శబరిమల శ్రీ ధర్మ శాస్త దేవాలయం మన తెలుగు రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా ర్యాలీ అనే పట్టణం నుండి కంటరారు వంశానికి చెందిన పురోహితులను పిలిచి వారికి ధర్మశాస్త్ర వారి పూజా విధానము తాంత్రిక విధానము ఎలా చేయాలో నేర్పించి శబరిమల పరిసరప్రాంతాలు అంతయు కంటరారు వంశీయులకు పరుషరాముడు దానము చేసినాడు నేటికీ కూడా కంటరారు రాజీవార్ తంత్రి మరియు వారి కుటుంబ సభ్యులే ప్రధాన తాంత్రికులు గా ఉన్నారు ఆ పరశురాముడు ఉపదేశించిన విధంగానే నేటి వరకు పూజలు జరుగుచున్నవి
ఓం శాంతి
సర్వేజనా సుఖినోభవంతు