⚜️ శబరిమల సన్నిధి చేరుటకు పదిమార్గాలున్నాయి. అవి.⚜️
1. కోట్టాయం నుండి పంబకు - 122 కి.మీ. (బస్సురూటు)
మార్గము: పుదుపళ్ళి - కరుక్కచ్చాల్ - మణిమాల - రాన్ని - వడశేరిక్కర -
చాలక్కాయం - పంబ.
2. కోట్టాయం నుండి ఎరిమేలికి - 52 కి.మీ. (బస్సురూటు)
మార్గము :- పుదుపళ్ళి - కరుక్కచ్చాల్ - మణిమాల - ఎరిమేలి
3. ఎరిమేలి నుండి పంబకు - 86 కి.మీ. (బస్సురూటు)
మార్గము :- రాన్ని - వడశేరిక్కర - చాలక్కాయం - పంబ
4. ఎరిమేలి నుండి పంబకు - 68 కి.మీ. (కాలినడక)
మార్గము :- కాళైకట్టి - అళుదా - ఇంజిప్పారకోట - పుదుచ్చేరిమల - ముక్కులి - కరివలంతోడు - కరిమల ఏట్రం - ఇరక్కం - పెరియానవట్టం - పంబ (వనమార్గం)
5. పునలూరు నుండి పంబకు - 102 కి.మీ. (బస్సురూటు)
మార్గము:- కోన్ని - కుంబుళ - వడశేరిక్కర - చాలక్కాయం - పంబ
6. వండిపెరియారు నుండి శబరిమలకు (17 కి.మీ)
వండిపెరియారు నుండి మౌంటు ఎస్టేటు వరకు - 8 కి.మీ కారు లేక జీపు మార్గము. మౌంటు ఎస్టేటు నుండి శబరిమలకి - 9 కి.మీ కాలి నడక మిక్కిలి నిటారైన కొండ ఎక్కే మార్గము.
7. వండిపెరియారు నుండి శబరిమలకు 15 + 10 + 4 = 29 కి.మీ. వండిపెరియారు నుండి కోయిక్కాణమునకు - 15 కి.మీ బస్సురూటు.
కోయిక్కాణము నుండి ఉప్పుపార వరకు - 10 కి.మీ జీపురోడ్డు. ఉప్పపార నుండి శబరిమలకు 4 కి.మీ
దట్టమైన నిలువెత్తు గట్టి పెరిగియున్న పుల్ మేడు అనబడు గుట్ట ఎక్కి పాండితావళం
దారిన కాలినడకగా శబరిమల.
8. చెంగన్నూరు నుండి పంబకు - 96 కి.మీ (బస్సురూటు)
మార్గము :- ఆరన్ ముళ - పతనం తిట్ట - వడశేరిక్కర - లాహ రబ్బర్ ఎస్టేట్ - ప్లాపల్లి - నిలక్కల్ - చాలక్కాయం - పంబ.
9. మధుర నుండి పంబకు - 130 కి.మీ (బస్సురూటు).
మార్గము :- పునలూర్ - కొడుమన్ - కోని - రాన్ని - మైయిలప్పార - వడశేరిక్కర - లాహ - ప్లాపళ్లి - నిలక్కల్ - చాలక్కాయం - పంబ.
10. పంబ నుండి శబరిమలకు - 6 కి.మీ (కాలినడక)
మార్గము :- నీలిమల - అప్పాచిమేడు - శబరి పీఠము - శరంగుత్తి - సన్నిధానం.
ఆలయము తెరచి యుండు మండల , మకర , విషు దినములలో తిరువనంతపురం ,చెంగన్నూరు , పతనంతిట్ట , కోట్టాయం , యర్నాకుళం మున్నగు స్థలముల నుండి పంబకు తరచు KSRTC బస్సులు గలవు. ఈ ప్రదేశములలో యాత్రికుల సౌకర్యార్థం కార్లు , జీపులు , వ్యాన్లు , మినిబస్సులు కిరాయికి లభించును.