కేరళలోని మలయాళ పుళలో దేవి గుడి ఉంది. ఈ భగవతి ఆలయం చాలా శక్తి వంతమైంది, కేరళలో ప్రసిద్ధి చెందింది.
గుడిలో నమస్కార మండపం, చుత్తంబలం, బలిక్కాల్ పుర ఉన్నాయి. ఇది ౩౦౦౦ ఏళ్ళకు పైదిగా నమ్మబడుతోంది. గుడి మధ్యమంగా ఉన్నా తూర్పు గోపురం చాలా గంభీరంగా ఉంటుంది. గర్భాలయం చతురస్రాకారంగా ముఖమండపంతో ఉంది. విగ్రహం ’కాడు శర్కర యోగం’ అనే పద్ధతిలో చేయబడింది. పలు రకాల చెక్కలు, బంకమన్ను, ఆయుర్వేద మూలికలు, పాలు, నెయ్యి, బెల్లం, పసుపు, చందనం, కర్పూరం, బంగారు, వెండి, ఇసుక, ప్రాకృతికమైన బంకలతో చేయబడింది. మానవ శరీరంలోని అన్ని భాగాలు విగ్రహానికి ఉండేలా చేశారు.
విగ్రహ ప్రతిష్టప్పుడు తాంత్రిక పూజలతో పాటు ప్రాణప్రతిష్ట చేయబడింది. గుడిలో ఒక స్వయంభూ లింగం ఉంది. అది పెరుగుతుందని నమ్మకం. ఈ లింగానికి గుడి లేదు ఒక కొన్న చెట్టు(casia fistula) ఏడాదంతా నీడనిస్తుంది.
ప్రధాన దేవత భద్రకాళి. ఉగ్రరూపమైనా భక్తుల పాలిట మాతృమూర్తిగా కరుణిస్తుంది. విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తుంది.
వినాయక చవితి, నవరాత్రి, శివరాత్రి, మంగళ వారాలు, శుక్రవారాలు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. మలయాల నెలకుంభంలో తిరువాదిర (ఆరుద్ర) నక్షత్రంలో ఇక్కడ మలయాళపుళ దేవి ఉత్సవాలు జరుగుతాయి. రోజు ఆరాట్టు జరుగుతుంది.
నైవేద్యాలు – తొనియరి(బియ్యపు) పాయాసం, నెయ్ విళక్కు(దీపం), నిరపర (బియ్యం, ధాన్యం, పంచదార ’పర’ అనబడే పాత్రలో అంచుదాకా).
అభిషేకాలు – విభూతి, చందనం, నూనె, పాలు, నెయ్యి, కొబ్బరి నీళ్ళు