అమృత బిందువులు - 11 ఆలోచనా తత్వం - 3

P Madhav Kumar


*ఆలోచనా తత్వం - 3*


మొగ్గలను తుంచి వేయనేకూడదు ! అది చెట్టుకే హాని.


గాలి మేడలు కట్టనేకూడదు ! అది అనర్థానికి మూలం.


స్నానం చేయక ఆలయప్రవేశం చేయనేకూడదు ! అది ఆచార విరుద్ధం. 


దేవాలయములో ఇంటికబుర్లు మాట్లాడనేకూడదు ! దైవ నిందకు సమం.


తీర్ధ ప్రసాదములను నేలపాలు చేయనేకూడదు ! అది ప్రసాద దిక్కారం.. 


ఆలయమున పూసిన పూలతో ఇంటిదేవునికి పూజచేయనే కూడదు ! 


ఆలయవస్తువులపై ఆశపడనేకూడదు ! అది కులనాశనమునకు దారి.


ఆలయాన మలమూత్రవిసర్జనాదులు చేయనేకూడదు ! ఖండించ దగినది. 


ఆలయములో చెత్తను పడవేయనేకూడదు ! అది పరిశుభ్రతకు నిలయం. 


పూజారుల వద్ద కోపతాపాలు ప్రదర్శించనేకూడదు ! అది దైవనింద వంటిది. 


ఆలయ సిబ్బందితో వాదులాడనేకూడదు ! అది ధర్మ విరుద్ధం.


ఒకలితో మరొకకాలును రుద్ది కడుక్కోనేకూడదు ! అది అరిష్టం. 


ఆలయాన పెట్టిన ఖర్చు గూర్చి చెప్పుకోనేకూడదు ! అది స్వయం ప్రలాపం.


మత్తు పానీయాలు సేవించి ఆలయప్రవేశం చేయనేకూడదు ! అది దోషం.


ఆలయంలో తోటి భక్తులకు ఇబ్బంది కలిగించనేకూడదు ! అది ఆచారహీనం. 


తనబాధలకు ఇతరులు కారణమని చెప్పనేకూడదు ! అది దోషమగును.


లేనితనాన్ని ప్రకటించకూడదు ! అది తక్కువ తనం. 


ధనమున్నదని గర్వపడనేకూడదు ! అది ప్రగల్భం.


నది స్నానం వేళ మలమూత్రవిసర్జన చేయనేకూడదు ! అది పవిత్రం.


మెప్పుదలకు ధనమును వ్యజించనేకూడదు ! అది దుబారతం.


లెక్కకు మించి ధనమును కూడ పెట్ట నెంచనేకూడదు ! అది అత్యాశే. 


ధనమును దుబారా చేయనేకూడదు ! అది వివేక లక్షణం.


సద్వినియోగ పరచక ధనమును బంధించియుంచనేకూడదు! అది దోషం.


పెద్దల హితోపదేశములను త్రోసిపుచ్చనే కూడదు ! అది ధిక్కారం అగును. 


నిస్సహాయుల పట్ల నిరాదరణ చూపనేకూడదు ! అది మానవత్వం కాదు.


మనస్సున పగను పెంచుకోనేకూడదు ! అది అశాంతికి మూలం. 


పరిసరములను పాడుచేయనేకూడదు ! అది ఆరోగ్య హాని.


వనమును ధ్వంసము చేయనేకూడదు ! అది పర్యావరణ హాని


ఆపదలో ఆప్తులను వదలిపెట్టనేకూడదు ! అది ఆపద్దర్మం 


గురువాక్యమును మరచిపోనేకూడదు ! అది ఉత్తమ శిష్యుని లక్షణం కాదు.


ధర్మం వీడి ప్రవర్తించనేకూడదు ! అది ధర్మ విరుద్ధం.


ఆకాల భోజనం చేయనేకూడదు ! అది అజీర్తికి మూలం.


అలోచనారహితంగా మాట్లాడనే కూడదు ! అది హానికరం. 


సమఉజ్జి కానిచో పోట్లాటకు దిగనేకూడదు ! అది అధర్మం.


ఇతరులను నమ్మిమోసపోనేకూడదు ! అది అవివేక లక్షణం.


చీటికి మాటికి చికాకు పడనేకూడదు ! అది బలహీనుల లక్షణం.


ఇతరుల ఎదుగుదలకు ఈర్ష్యపడనేకూడదు ! అది తన ఎదుగుదలకు చేటు.


స్నానమాడక నదిని దాటి వెళ్ళనేకూడదు ! అది శాస్త్ర విరుద్ధం.


భార్యను పరపురుషులతో యాత్ర పంపనేకూడదు ! అది అనర్థ దాయకం.


స్వార్ధ చింతనతో వ్యవహరించనేకూడదు ! అది సమాజ ద్రోహం.


కుళ్ళిపోయిన పదార్థములను భుజించనేకూడదు ! అది అనారోగ్యకరం.


పనివాళ్ళను చులకనగా చూడనే కూడదు ! అది యజమాని లక్షణం కాదు.


ఆధికారులతో నిర్లక్ష్యంగా వ్వవహరించనేకూడదు ! అది పనిచేటు.


రేయి పూట అనవసరంగా వీధిలో తిరగనేకూడదు ! అది దొంగల లక్షణం.


తనవద్దలేనిది ఎదుటివానివద్ద యున్నదని అసూయపడనే కూడదు !


పెద్దలకు పెట్టక తాను మొదట భుజించనేకూడదు ! అది పాపము.


అక్రమాలకు తోడు పోనేకూడదు ! అది హానికరం.


దేశ ద్రోహం చేయనేకూడదు ! అది చట్ట విరుద్ధం.


దొంగ సొమ్మును చవకయని కొననేకూడదు ! అది ప్రమాదకరం.


జూదమాడనేకూడదు ! అది మహాపాతకము.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat