*లౌకిక తత్వం - 1*
దేవుడిని అన్నింటా చూడగలిగితే మనం చేసే ప్రతీపని ఓ ప్రార్థనే అవుతుంది.
పుణ్యకార్యాలు చేయగాచేయగా గానీ మనసు పవిత్రం అవదు.
సాధ్యమైనంతవరకూ అవసరాలు తగ్గించుకుంటే మేలు.
పాపపు పనులు చేయడం సులభం. మంచిపనులు చేయడం కష్టం.
చెడు జరిగినా మన మంచికేనని అనుకొంటే కొంత బాధ తగ్గుతుంది.
స్వార్థచింతన మానుకొని దైవచింతన చేయడం ముఖ్యం.
మనస్సులోని మలినాలను తుడిచివేసి , మహనీయులుగా , ధైర్యశాలులుగా మనిషిని మార్చివేసేదే మంచి పుస్తకం.
ఫలించని దాని కోసము ప్రయత్నించకు. ఫలించే దాని కోసము ప్రయత్నించు. అప్పుడు నీవు గెలిచిన వాడు కాగలవు.
ఆత్మతోనే తృప్తి అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకో.
ఆత్మ తృప్తి చెందినచో బాధలు ఉండవు. హెచ్చు తగ్గులు అగుపడవు.
ఆత్మ సంతుష్టిలోనే సుఖమనే చక్కటి అమృతాన్ని త్రాగగలవు.
చెడుతో సహవాసం బ్రతుకుకు వనవాసం.
క్రమములేని బ్రతుకు కష్టాలకు , కన్నీటికి గురి కాగలదు.
ఆశ ముద్దు - అత్యాశ వద్దు. ఆశకు హద్దులుండును. అది తెలుసుకో.
కలుషితం వలన గుంత అపరిశుభ్రమయినట్లు కలుషిత మాటలు వినే వారు కూడా కలుషితము కాగలరు. కావున ఆలోచించి మాట్లాడాలి.
సుఖములోనే కమ్మదనము ఉంటుందను కోవడము పొరపాటు , కష్టాలలో కూడా కమ్మదనము ఉంటుంది. అది కష్టపడిన వారికే తెలుస్తుంది.
వినయం లేని విద్య పైరు లేని పొలం లాంటిది.
అప్పగించిన పనిని పూర్తిచేసి న్యాయము చేయడం ఉత్తముల లక్షణము.
ఇతరుల నుండి ఆనందాన్ని ఆదర్శంగా తీసుకో. ఐశ్వర్యాన్ని ఆదర్శంగా తీసుకోకు.
ప్రతివైఫల్యము విజయానికి మెట్టు అని తెలుసుకోవాలి.
ప్రపంచములో గల మేధావులందరికన్నా ఒక మంచి హృదయం గల మనిషి ఎంతో గొప్పవాడు.
ఆలయమునకు , పెద్దలవద్దకు , పీఠాధిపతులవద్దకు , వివాహానికి , పురాణానికి , వెళ్ళునపుడు, పాదరక్షలు విసర్జించి వెళ్ళవలయును.
శారీరకబలం వ్యక్తిత్వబలం ముందు నిలబడలేదు.
మనిషి స్వేచ్ఛకు బానిస.
ఒంటరిగా బయలుదేరిన వ్యక్తి వేగంగా వెళతాడు.
మనిషి వ్యక్తిత్వమే అతని విధి రాత.
ఆలోచించి చేసే ఏ పనికైనా విజయావకాశాలు ఎక్కువ.
సాధన చేస్తే కష్టాలన్నీ మటు మాయమవుతాయి.
మంచి పనులు చేసేటప్పుడు బిడియపడడం మంచిదికాదు.
చదవదగని రచన చేసినవాడు ఏమి రాయనట్లే లెక్క
పెద్ద బహుమానం ఇతరులను మన్నించే గుణం.
సాధన అభివృద్ధికి రాజబాట , కఠిన సాధన సత్య వర్తన.
అందరికి సమమైనది జనన మరణాదులు.
విడమరిచి చూడలేనిది పాశుబంధాలు.
తప్పించలేనివి ఆకలి దప్పులు
పోతే మరలా రానివి రెండు. మానము , ప్రాణము.
వస్తే పోనివి రెండు. కీర్తి , అపనింద
పూజించ దగినవారు తల్లిదండ్రులు.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కోరికలను విడిచి పెట్టినవాడు చెడిపోడు. చెడిపోయిన వాడు కోరికలను విడిచి పెట్టడు.
మంచి వృక్షము మంచి పండ్లను పండించును.
ఏ పని నీకు అలవాటు అయినచో అందున క్రొత్త దాన్ని యిమూడ్చు
తెలివి ఒక ఖజానా ! ప్రశ్నలే దాని తాళంచెవి.