🔱 శబరిమల వనయాత్ర - 19 ⚜️ వలియాన వట్టం ⚜️

P Madhav Kumar


⚜️ వలియాన వట్టం ⚜️


అతి మనోహరమైన ఒక ఉద్యానవనముగా కన్పించుచున్నది ఈ ప్రదేశము. రామాయణము నందు వర్ణింపబడిన సుగ్రీవుని యొక్క *“మధువనమా"* ఇదియను భ్రమను కల్గించినను అతిశయోక్తి లేదు. ఎడమ ప్రక్క గలగల శబ్దముతో ప్రవహించే పంబానది అలసిపోయి వచ్చేస్వామి భక్తాదులను చేజాపి రా ! అని పిలిచే కన్నతల్లి ఒడిలా కన్పించును. మైదానము వంటి బట్టబయలు ప్రదేశములో నిటారుగా వంపులు , సొంపులుతో కూడిన దారి. ఈ ప్రాంతమంతయు తలపైకెత్తి చూడదగిన వృక్షములు కూటమిగా పెరిగి ప్రకృతి ఏర్పరచిన పందిరిలా కన్పించు దృశ్యం కన్నుల పండుగగా యుండును. ఇచ్చట తావళములు(విడిదులు) ఏర్పరచు కొని విశ్రాంతి పొందుదురు. పంబాతావళము యొక్క విరులు ఇక్కడదాకా పాకియున్నది. ఏటేట

పెరిగి అసంఖ్యా ప్రవాహములా వచ్చుచున్న అయ్యప్ప భక్తులకు తల్లి ఒడివలె ఆశ్రయమొసంగు చున్నది. మార్గశిరమున భక్తులు ఇచ్చట తావళమేర్పరచుకొని విశ్రమించి వెడలుట మొదలౌతుంది. మార్గశిరము (మలయాళధను) 29 , 30 తారీఖులందు (జనవరి 12 , 13) ఈ ప్రదేశము భక్తుల రాకపోకలతో మిక్కిలి రద్దీగా యుండును.


అఖిలభారత అయ్యప్ప సేవాసంఘమువారి ఒక ప్రత్యేక కేంద్రము ఇచ్చట బాధ్యతగా ఏర్పరచి కర్తవ్య నిర్వహణ చేయుచున్నది. వైద్యసదుపాయము , మంచి నీటి సరఫరా , ఆహార సదుపాయములను సమకూర్చి ఇచ్చట గుమిగూడే అయ్యప్పభక్తాదుల హృదయములో ఒక సద్భావనను కలుగ జేసుకొను చున్నారూ ఈ అఖిలభారత అయ్యప్ప సేవాసంఘంవారు. విపరీతమైన జన సంచారము వలన పరిసర ప్రాంతమంతయు మాలిన్యము చెంది క్రిమికీటకముల వలన రోగములు అతిత్వరగా సోకే అవకాశమున్న ఇట్టి స్థలములో త్రాగు నీరును ఉష్ణపరచి అందున జీలకర్ర. శొంఠి మున్నగు వ్యాధి నిరోధక మూలికలను వేసి కాచి భక్తులకు వినియోగించే వారి సేవ సూచించి హర్షింపతగ్గ దగును. దేశపు నలుమూలల యుండు పలు ప్రాంతీయులు ఎరుమేలి మార్గముగా ఈ వలియాన వట్టం దాటువేళ అచ్చట ఇదివరకే తావళము వేసి శాస్తా ప్రీతి జరిపి భక్తాదులకు అఖండ అన్నదానము చేసే కేరళ బ్రాహ్మణ సమూహమువారి విధానము ఎంతో కొనియాడతగ్గదగును. వీరు భగవత్సేవ , శాస్తావివాహము , గురుపూజ మున్నగు వైదీహ్య కార్యక్రమములను శాస్తోక్తముగా సలిపి పలు వేల భక్తులకు అన్నదానమొసంగి మురిసెదరు. పందళరాజధాని నుండి శబరిమలై ధర్మశాస్తావారికి మకర సంక్రాంతి పర్వదినమున అలంకరించుట కొరకై కొని తెచ్చే శ్రీ అయ్యప్ప స్వామివారి తిరువాభరణములు యుంచిన పెట్టెలు జనవరి 14 మధ్యాహ్నము ఇచ్చట చేరుకొనును. పెట్టెలు దించబడి 'ఎయుంన్నెల్లిప్పు పూజ సలిపిన పిమ్మటే ఈ పెట్టెలను శబరిమలకు మోసుకొని వెళ్ళుట సాంప్రదాయము. ఈ తిరువాభరణపెట్టెలను తాకి మ్రొక్కుటకును , ఎయుంన్నెల్లిప్పు

పూజలో పాల్గొని ఆనందించుటకును వేలసంఖ్యలో భక్తులు ఏటేట అచ్చటగుమిగూడి ఆనందించెదరు. తిరువాభరణం పయణమైనచో వలియానతావళము నందున్న సకల అయ్యప్ప భక్తాదులు ఆభరణపెట్టిని అనుసరిస్తూ సన్నిధానమువైపు

పయనమౌదురు.


🙏💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat